ఇటీవల కాచిగూడలో జరిగిన రైలు ప్రమాదంలో గాయపడ్డ ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో డాక్టర్లు గురువారం ఉదయం ఆయన కుడి కాలును తొలగించడం జరిగింది. ఆయనకు కిడ్నీలు దెబ్బతిన్నాయని తెలుస్తోంది.  సాయంత్రం నాలుగు గంటలకు చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అతనికి నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 


 
చంద్రశేఖర్ నవంబర్ 11 సోమవారం ఉదయం 10.30 నిమిషాలకు రైలు క్యాబిన్ లో ఇరుక్కుంటే సాయంత్రం 6.30 నిమిషాలకు అతనిని బయటికి తీసిన విషయం తెలిసిందే. దాదాపు 8 గంటల పాటు క్యాబిన్ లో చంద్రశేఖర్ నరకయాతన అనుభవించారు. ఎన్డీఆర్ఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తీవ్రంగా శ్రమించి చంద్రశేఖర్ ను సాయంత్రం బయటికి తీయగలిగారు. అతను క్యాబిన్ లో ఉండడంతో క్యాబిన్ లోకి ఆక్సిజన్ పంపించి సెలైన్ బాటిల్స్ ఎక్కించి చికిత్స చేయడం జరిగింది.    


 
కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న ప్యాసింజర్  ట్రైన్ ను సోమవారం ఉదయం వెనుక నుంచి వచ్చిన  ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ రైలు కర్నూల్ హైదరాబాద్ హంద్రి ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్. ఎంఎంటీఎస్ రైలు మలక్ పేట నుంచి సికింద్రాబాద్ వెళ్తుంది. హంద్రి ఎక్స్ ప్రెస్ కర్నూల్ నుంచి హైదరాబాద్ వస్తూ కాచిగూడ స్టేషన్ లో ఆగింది. సిగ్నలింగ్ వ్యవస్థ లోపం వల్ల కాచిగూడలో ఒకే ట్రాక్ పైకి రెండు రైళ్లు వచ్చాయని తెలుస్తోంది. టెక్నికల్ లోపం వల్ల ఎక్స్ ప్రెస్ ట్రైన్ పట్టాలపై ఆగిపోయింది. సిగ్నలింగ్ వ్యవస్థలో రెడ్ సిగ్నల్ పడాల్సిన దానికి బదులు గ్రీన్ సిగ్నల్ పడడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఎంఎంటీఎస్ రైలు డ్రైవర్ చాకచాక్యంతో పెద్ద ప్రమాదమే తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: