గుడివాడ అని చెప్పగానే ఠక్కున గుర్తొచ్చే పేరు ఎన్టీఆర్…తన సొంత నియోజకవర్గం కావడం, ఎన్టీఆర్ తొలిసారి ఎన్నికల్లో ఇక్కడ నుంచే పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవడంతో గుడివాడ ఎన్టీఆర్ అడ్డాగా మారిపోయింది. ఎన్టీఆర్ వల్ల గుడివాడ టీడీపీకి కంచుకోటగా మారింది. అయితే అలాంటి ఎన్టీఆర్ గడ్డపై టీడీపీ ఇప్పుడు కష్టాలు ఎదురుకుంటుంది. ఇక్కడ ఎప్పుడైతే కొడాలి నాని ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి పరిస్థితులు మారిపోతూ వచ్చాయి. నందమూరి ఫ్యామిలీ సన్నిహితుడుగా ఉన్న కొడాలి నాని 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపునే గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.


కానీ జిల్లాలో దేవినేని ఉమా లాంటి వారి ఆధిపత్య రాజయకీయాలని తట్టుకోలేని నాని 2014 ఎన్నికల ముందు వైసీపీలోకి వెళ్ళిపోయారు. అయితే నాని వైసీపీలోకి వెళ్ళిన గుడివాడలో టీడీపీనే గెలుస్తుందని అనుకున్నారు. కానీ 2014 ఎన్నికల్లో అలా ఏం జరగలేదు. కొడాలి నాని మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. నాని మీద రావి వెంకటేశ్వరావు పోటీ చేసి ఓడిపోయారు.


ఇక ఇలా లాభం లేదని భావించిన బాబు 2019 ఎన్నికల్లో విజయవాడకు చెందిన యువనేత దేవినేని అవినాష్ ని నాని మీద బరిలో దించారు. అవినాష్ కూడా దారుణంగా ఓడిపోయాడు. ఎందుకంటే ఇక్కడ ఏ పార్టీకి ఆ పార్టీ కేడర్ ఉన్న నానికి ప్రత్యేకంగా కేడర్ ఉంది. దాని వల్లే నాని విజయాలకు టీడీపీ అడ్డుకట్ట వేయలేకపోయింది. అయితే ఇప్పుడు అవినాష్ కూడా వైసీపీ వైపు వచ్చేశారు. దీంతో గుడివాడలో నానిని ఎదురుకునే టీడీపీ నాయకుడే లేకుండా పోయాడు.


రావి వెంకటేశ్వరావు, పిన్నమనేని బాబ్జీ, పిన్నమనేని వెంకటేశ్వరావు, యలవర్తి శ్రీనివాసరావులు ఉన్న, వారు నానికి పోటీ ఇచ్చేంత సత్తా లేదు. దీంతో ఇక్కడ టీడీపీని నిలబట్టే నాయకుడే లేకుండా పోయాడు. మొత్తానికైతే ఎన్టీఆర్ అడ్డాగా ఉన్న గుడివాడ మీద టీడీపీ ఆశలు వదిలేసుకోవాల్సిందే. భవిష్యత్తులో ఇక్కడ టీడీపీ గెలవడం కల్లే.  


మరింత సమాచారం తెలుసుకోండి: