ఒకపక్క రాజకీయంగా ఇబ్బంది పడుతున్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు నేతల తీరు ఇబ్బందికరంగా మారిన సంగతి తెలిసిందే. చంద్రబాబు  నమ్మకం లేని నేతలు ఇప్పుడు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. అన్ని జిల్లాల సంగతి ఏమో గాని పార్టీకి కంచుకోట లాంటి కృష్ణా జిల్లాలో పార్టీకి ఒక్కరోజే ఊహించని ఎదురు దెబ్బలు తగిలాయి. పార్టీలో బలమైన నేతలుగా ఉన్న దేవినేని అవినాష్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఒకే రోజు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాడేపల్లి వెళ్లి జగన్ సమక్షంలో అవినాష్ వైసీపీలో చేరగా...


గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ త్వరలోనే పార్టీలోకి వెళ్తాను అని కీలక ప్రకటన చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయంగా ఇది పార్టీకి కోలుకోలేని దెబ్బ అని జిల్లాలో సీనియర్ నేతలు అంటున్నారు. వాస్తవానికి దేవినేని అవినాష్ కి రాష్ట్రం మొత్తం అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఇక కృష్ణా జిల్లాలో అయితే దేవినేని అభిమానులు గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు.


ఇప్పుడు ఉన్నపళంగా అవినాష్ పార్టీ మారడంతో వారు కూడా పార్టీకి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్తున్నారు. ఈ పరిణామం కార్యకర్తలకు మింగుడు పడటం లేదు. రాజకీయంగా జిల్లాలో ఒకప్పుడు చక్రం తిప్పిన నేతలు కూడా ఇప్పుడు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక వంశీ కూడా పార్టీ మారతాను అని స్పష్టం చేయడంతో పార్టీ భవిష్యత్తు ఏంటి అనే ఆందోళన కార్యకర్తల్లో నెలకొంది.


దేవినేని ఉమా, కేశినేని నాని వంటి వారు వారి వారి నియోజకవర్గాల్లో మాత్రమే బలం ఉన్న నేతలు. కానీ వంశీకి, అవినాష్ కి జిల్లా వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇక జిల్లాలో ఉన్న యువనేతలు కూడా వీరే. అందరూ సీనియర్ నేతలు కావడం, వారు ఆకట్టుకునే నేతలు కూడా కాకపోవడంతో పార్టీ భవిష్యత్తు ఏంటి అనే ఆందోళన నెలకొంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: