తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణ‌యం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈనెల 18 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్ర‌వారం జరగనుంది. ఈ నేప‌థ్యంలో...హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో  నాలుగు గంటలకి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు, పార్టీ పార్లమెంటరీ  పక్ష నేత కె. కేశవరావు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారని అని టీఆర్ఎస్ పార్టీ వెల్ల‌డించారు. 


డిసెంబర్ 13 వరకు జరిగే ఈ సెషన్‌లో పలు కీలక బిల్లులను ప్రవేశ పెడతారు. ఈ సమావేశాల్లోనే కేంద్రం రెండు కీలక ఆర్డినెన్సులను చట్టంగా రూపొందించాలని భావిస్తోంది. అందులో ఒకటి- దేశీయ కంపెనీలకు కార్పొరేట్​ పన్ను తగ్గింపును చట్టంగా మార్చడం. రెండోది- ఎలక్ట్రానిక్​ సిగరెట్ల ఉత్పత్తి, అమ్మకం, దిగుమతి నిషేధంపై జారీ చేసిన ఆర్డినెన్స్​ నూ చట్టంగా రూపొందించడం. అయోధ్యలో ట్రస్ట్‌ ఏర్పాటు చేసి, రామ మందిరాన్ని నిర్మించాలని సుప్రీం తీర్పు వచ్చిన నేపథ్యంలో, దీనికి సంబంధించిన బిల్లును కూడా ఈ సెషన్‌లోనే ప్రవేశపెట్టనుంది. ఇకపోతే, ఆర్థిక మందగమనం, నిరుద్యోగం సమస్యలపై సర్కారును నిలదీసేందుకు విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి.


ఈ స‌మావేశాల నేప‌థ్యంలో... టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్  సభ్యుల స‌మావేశం నిర్వ‌హిస్తోంది. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ ఎంపీలు హజరయ్యే ఈ సమావేశంలో 18 నుంచి ప్రారంభం కానున్న శీతాకాల పార్లమెంటరీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాంపైన చర్చిస్తారు. ఈ మేరకు పార్టీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్ధేశం చేస్తారు. అయితే, ఇంత‌టి కీల‌క‌మైన స‌మావేశాల్లో రాష్ట్రం త‌ర‌ఫున గ‌ళం వినిపించ‌డం, వివిధ అంశాల‌పై ప్ర‌తిపాద‌న‌లు పెట్ట‌డం, హ‌క్కుల విష‌యంలో స్పందించ‌డం అనే అంశాల‌పై...ముఖ్య‌మంత్రి, పార్టీ అధినేత‌గా..కేసీఆర్ దిశానిర్దేశం చేసిన దానికి...కేటీఆర్ వ్యూహ‌ర‌చ‌న‌కు ప‌రిపాల‌న‌, రాజ‌కీయ తేడా ఉంటుంద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. అయిన‌ప్ప‌టికీ....ఎంపీల‌తో స‌మావేశాన్ని కేసీఆర్ లైట్ తీసుకోవ‌డం చిత్రంగా ఉంద‌ని విశ్లేషిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: