ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందా...? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతుంది. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు పాలన మూళ్ళ మీద నడకే... ఒక్కో ముల్లుని తొలగిస్తూ ముందుకి వెళ్లాల్సిన అవసరం ఉంది. జాగ్రత్త పడుతూ అడుగులు వెయ్యాల్సి ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి దారుణంగా క్షీణించింది. చంద్రబాబు చేసిన అప్పులు, బ్యాంకు ల నుంచి రుణాలు అందకపోవడం, కేంద్రం నుంచి సాయం అందకపోవడం వంటివి జగన్ ని తొలి రోజుల్లో తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. సీనియర్ అధికారులు కూడా చేతులు ఎత్తేసారు.


ఈ తరుణంలో జగన్ తీసుకునే కొన్ని నిర్ణయాలు ప్రభుత్వ మీద నమ్మకం పెంచాయి. ముందుగా జగన్... అధికారులకు ఒక్కో లక్ష్యాన్ని నిర్ధేశించారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి తేదీలను కూడా ప్రకటించారు. ఆ తేదీల్లో నిధుల సమీకరణకు, అన్ని మార్గాలను అన్వేషించాలని జగన్ సూచించారు. దీనితో అధికారులు జగన్ లక్ష్యాన్ని చేరుకోవడానికి తీవ్రంగానే శ్రమించారు.


దీనితో అనుకున్న సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయించారు జగన్. ఎన్ని విమర్శలు విపక్షం నుంచి వచ్చినా సరే జగన్ మాత్రం, సంక్షేమ కార్యక్రమాల విషయంలో వెనక్కు తగ్గలేదు. ఇప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి. ఒక్కో కార్యక్రమం ప్రతీ ఒక్కరికి అందాలి అని లక్ష్యంగా పెట్టారు జగన్. రైతు భరోసా, అమ్మ ఒడి, వాహన మిత్ర, ఇలా ఎన్నో కార్యక్రమాలకు జగన్ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాలతో జగన్ పని తీరుపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది అనేది పరిశీలకుల మాట.


అనుభవం లేదు ఏ విధంగా నడిపిస్తాడు అని భావించిన జనానికి జగన్ పని తీరే సమాధానంగా మారింది. ఇంకా చెప్పాలంటే పార్టీల‌తో సంబంధం లేని ఇమేజ్ ఇప్పుడు జ‌గ‌న్ సొంతం అయ్యింది. ఏపీలో పార్టీ ఏదేనా.. ఇత‌ర పార్టీల్లోనూ జ‌గ‌న్‌కు వీరాభిమానులు మెండుగా ఉన్నారు. భవిష్యత్తు మీద కూడా నమ్మకం ఏర్పడిందని ప్రజల్లో ఆయనపై విశ్వాసం వ్యక్తమవుతుంది. ఇక మరిన్ని కార్యక్రమాలను ఆయన విజయవంతంగా అమలు చేయగలరు అంటూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: