తెలుగు  రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే.  ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తరచుగా కలుసుకోవడం.. మాట్లాడుకోవడం.. వివిధ విషయాల పట్ల అవగాహనకు వస్తుండటం వంటివి చేస్తున్నారు.  పరిపాలన విషయంలో రెండు రాష్ట్రాలు ముందు ఉన్నాయి.  అయితే, జగన్ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తరువాత పాలనా విషయంలో తెలంగాణ కంటే ఒక అడుగు ముందుగానే ఉన్నాడు.  


ఇచ్చిన హామీలను త్వరగా అమలు చేస్తున్నాడు.  తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు.  ఎక్కడా కూడా ఇది తప్పు అని ఎత్తి చూపించే అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్షాలను చెక్ పెట్టాడు.  ఒక్క ఇసుక వ్యవహారం తప్పించి మిగతా అన్ని విషయాల్లో జగన్ చాలా స్పీడ్ గా ఉంటున్నాడు.  వరదలు రావడం వలనే ఇలా జరిగిందని ప్రభుత్వం చెప్తున్నది.  త్వరలోనే ఇసుకకు సంబంధించిన వ్యవహారం కూడా పూర్తవుతుందని అంటున్నారు. 


ఇక ఇదిలా ఉంటె, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటికి సంబంధించిన చాలా అంశాలు వివాదంగా ఉన్నాయి.  ఇప్పుడు అందులో కాళేశ్వరం ఒకటి వచ్చి చేరింది.  కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం.  దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించింది.  జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి వీలు లేదని సుప్రీం కోర్టులో  కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.  


450 టిఎంసిల నీటి వినియోగం కోసం కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పధకం వంటివి ఏర్పాటు చేసింది.  రీ ఇంజనీరింగ్ పేరుతో నిర్మించామని చెప్తున్నా.. ఎయిడ్ ముమ్మాటికీ నూతన ప్రాజెక్ట్ అని ఏపి వాదిస్తోంది.  తెలంగాణలో నిర్మిస్తున్న నూతన ప్రోజెక్టుల వలన, పోలవరం, ధవళేశ్వరంపై ప్రభావం పడుతుందని ఎపి ప్రభుత్వం పేర్కొన్నది.  ఏపి ప్రోజెక్టుల పరిధిలోని రైతులను విస్మరించి పక్షపాతంతో కాళేశ్వరం పనులు కొనసాగిస్తోందని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే విషయాన్నీ పరిగణలోకి తీసుకోవద్దని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: