ఇండేనేషియా మొలుక్క మొలుక్క స‌మీద్రంలో గురువారం రాత్రి భారీ భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేలుపై 7.1గా నమోదైంది. అలాగే అండ‌మాన్‌, నికోబార్ దీవుల్లోనూ భూకంపం చోటు చేసుకుంది. ఇక్క‌డ భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 5.1గా న‌మోదైంది.ఇండేనేషియ‌లోని టెర్నెట్ ప‌ట్ట‌ణానికి వాయువ్యా దిశ‌గా 139 కిలోమీట‌ర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్న‌ట్లుగా జియోలాజిక‌ల్ అధికారులు గుర్తించారు. దీంతో ఇండోనేషియా అధికారులు సునామీగా ప్ర‌క‌టించారు.


ఇండోనేషియాలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్రాణ‌న‌ష్టంగాని...ఆస్తిన‌ష్టం గాని జ‌ర‌గ‌లేద‌ని అక్క‌డి మీడియా స్ప‌ష్టం చేసింది. అయితే కొద్ది గంట‌లు గ‌డిస్తే గాని  పూర్తి స‌మాచారం..వివ‌రాలు వెల్ల‌డించ‌లేమ‌ని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే భార‌త్‌లో అండ‌మాన్ నికోబార్ దీవుల్లోనూ ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. స‌ముద్రంలోనూ భూకంప తీవ్రత ఉంటుద‌ని భావించిన అధికారులు మ‌త్స్య‌కారులు చేప‌ల వేట‌కు వెళ్ల‌కుండా ఆదేశాలు జారీ చేశారు.


స‌ముద్ర తీరానికు స‌మీపాన ఉన్న జ‌నాలు ర‌క్ష‌ణ ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్లాల‌ని ఆదేశించారు. ఇప్ప‌టికే భార‌త ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయింది. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లుగా స్థానిక ర‌క్ష‌ణ సిబ్బందిని భూకంప తీవ్ర‌త ఉన్న ప్రాంతాల‌కు త‌ర‌లిస్తుండ‌గా.. అద‌న‌పు ఎన్డీఆర్ ఎఫ్ బృందాల‌ను త‌ర‌లించేందుకు ఆదేశాలు జారీ చేసింది. అయితే రెండు దీవుల్లో భూకంపం న‌మోదైన  భార‌త జియోలాజిక‌ల్ అధికారులు సునామీగా మాత్రం ప్ర‌క‌టించ‌లేదు.


ఇక అక్క‌డ సునామీ ప్ర‌క‌ట‌న‌తో ద‌క్షిణ ప‌సిఫిక్‌లోని ప‌లు దేశాల ప్ర‌భుత్వాలు ఎలెర్ట్ అయ్యాయి. తీర ప్రాంతాల్లో ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌మాద హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు. స‌ముద్ర లోత‌ట్టు ప్రాంతాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌ను ముందుగానే సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు. ఇక ముఖ్యంగా ద్వీప దేశాలు, ద్వీప‌క‌ల్పాలు, దీవుల్లో ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రికలు జారీ చేస్తున్నారు. ఇటు మ‌న‌దేశంలో తీర ప్రాంతాల‌తో పాటు ప‌శ్చిమ , తూర్పు తీరాల్లో కూడా అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: