తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అనినాశ్ వైసీసీ గూటికి చేరారు. కొంత‌కాలంగా ఊగిస‌లాట‌లో ఉన్న ఆయ‌న ఎట్ట‌కేల‌కు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన అవినాశ్‌..  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నివాసంలో గురువారం వైసీపీ కండువా కప్పుకున్నారు. కొంత‌మంది అనుచరులు  అవినాశ్‌ వెంట అడుగులు వేయ‌గా, మరికొంత మంది మాత్రం వేచిచూసే ధోరణిలో ఉన్నారు.


జిల్లా రాజకీయాల్లో దేవినేని నెహ్రూ కుటుంబానికి ఒక ప్రత్యేక ముద్ర ఉంది.  చాలా కాలం పాటు దేవినేని నెహ్రూ జిల్లా రాజకీయాలను శాసించారు. ఆ కుటుంబం నుంచి వచ్చిన అవినాశ్‌ తండ్రి వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చ‌కుని,  అనుచరగణాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. తండ్రి మాదిరిగానే జనంతో మ మేకమవుతూ ముందుకు సాగుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీచేసి ఓటమి పాల య్యారు. అప్ప‌టి నుంచి టీడీపీకి దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. ఈక్ర‌మంలోనే అవినాశ్ పార్టీ మారుతార‌నే ప్ర‌చారం జ‌రిగింది.  


దేవినేని అవినాశ్‌ పార్టీ మార్పు అంశం టీడీపీలో ముఖ్యంగా విజయవాడలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అవు తోంది.  టీడీపీలో తగిన ప్రాధాన్యం లేక‌నే  పార్టీ మారార‌ని ఆయ‌న అనుచ‌రులు పేర్కొంటున్నారు. అయి తే   వైసీపీలో అవినాశ్‌కు ఎలాంటి ప‌ద‌వి, ప్రాధాన్యం ఇస్తారన్న దానిపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపి స్తున్నాయి.  విజయవాడ తూర్పు, పెనమలూరు నియోజకవర్గాల్లో దేవినేని నెహ్రూకు అనుచ‌రులు ఉ న్నారు. వాళ్లంతా అదే అభిమానాన్ని అవినాశ్‌ పైనా చూపిస్తున్నారు.


ఈక్ర‌మంలోనే వైసీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అవినాశ్‌కు అప్పగిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం తూర్పు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, బొ ప్పన భవకుమార్ కీల‌క నేతలుగా ఉన్నారు. వారిలో భవ కుమార్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓ డిపోయారు. అవినాశ్‌కు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించాల్సి వస్తే మిగిలిన ఇద్దర్ని ఒప్పించాల్సి ఉం టుంది. ఈ విషయంలో జగన్‌ ఎలాంటి అడుగులు వేస్తారో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: