డ‌బ్బు ఎంత ప‌నైనా చేయిస్తుంది. ఆక‌లి తీర్చ‌గ‌ల‌దు..అన్యాయమూ  చేయించ‌గ‌ల‌దు..  అవ‌స‌రం డ‌బ్బుల‌ను డిమాండ్ చేస్తే....డ‌బ్బుల‌ను అవ‌స‌రం డిమాండ్ చేస్తుంది. అందుకే జ‌గ‌మంత అనేది ఒక్క‌టే అదే  డ‌బ్బు టూ ది ప‌వ‌రాఫ్ డ‌బ్బు..అని. ఇక అస‌లు విష‌యంలోకి వెళ్తే.. నిరుపేద మ‌హిళ‌ల‌..యువ‌తుల డ‌బ్బు అవ‌స‌రాల‌ను గుర్తిస్తూ వారిని వ్య‌భిచార వృత్తిలోకి దించుతున్న ఓ వ్య‌క్తిని గుజ‌రాత్ రాజ్‌కోట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు షాపార‌గా గుర్తించారు.


అనేక ఏళ్లుగా వ్య‌భిచార వృత్తి నిర్వాహాకుడిగా కొన‌సాగుతున్న‌ట్లుగా విచార‌ణ‌లో తేలింది.  వ్య‌భిచారం నిర్వ‌హిస్తూ 2012లో పోలీసుల‌కు చిక్కిన ఇత‌డు  బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చాడు. అయినా బుద్ధి మార‌లేదు. మ‌ళ్లీ వ్య‌భిచార నిర్వ‌హ‌కుడిగానే కొన‌సాగుతున్నాడు. అయితే కాల‌నుగుణంగా విటుల‌ను ఆక‌ర్షించేందుకు స్టార్ హోట‌ళ్లు...ఖ‌రీదైన ఇళ్ల‌ను అద్దెకు తీసుకుని నిర్వ‌హిస్తున్నాడు. రాజ్‌కోట్‌లో గుట్టుచ‌ప్పుడు కాకుండా ఏళ్లుగా సాగుతున్న ఈ అక్ర‌మ వ్యాపారంపై ప‌క్కా స‌మాచారంతో ఇటీవ‌ల పోలీసులు చెక్ పెట్టారు.


ఓ ఖ‌రీదైన భ‌వ‌నంలో సాగుతున్న వ్య‌భిచారాన్ని ర‌ట్టు చేసేందుకు ఓ వ్య‌క్తిని విటుడిగా పోలీసులు పంపారు. ఆ వ్య‌క్తి లోప‌లికి వెళ్లాక పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో రైడ్ చేశారు. దీంతో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌తో పాటు మూడు సెల్‌ఫోన్లు..రూ5వేల న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు.
ఇక వ్య‌భిచారం చేస్తూ ప‌ట్ట‌బ‌డిన ఇద్ద‌రు మ‌హిళ‌లు వెల్ల‌డించిన వివ‌రాలు పోలీసుల‌ను సైతం బాధించాయి. విటుల ద‌గ్గ‌ర నుంచి గంట‌కు రూ.2వేల వ‌ర‌కు తీసుకుని త‌మ‌కు మాత్రం కేవ‌లం రూ.వెయ్యే ఇస్తాడ‌ని షాప‌రాపై ఆరోపించారు.


ఇక కొంత‌మంది రెగ్యుల‌ర్‌గా వ‌చ్చే విటులు త‌మ‌ను చాలా ఇబ్బందుల‌కు గురిచేస్తారిన మద్యం సేవించి వ‌చ్చి త‌మ‌ను తాగ‌మ‌ని బ‌ల‌వంతం చేస్తార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ‌కు ఇష్టం లేకున్నా దిక్కులేని ప‌రిస్థితిలో ఈ రొంపిలోకి రావాల్సి వ‌చ్చింద‌ని క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యార‌ట‌. వ్య‌భిచారాన్ని ఎంత అరికట్టాల‌నుకున్నా సాధ్యం కావ‌డం లేద‌ని గుజ‌రాత్ పోలీసులు ఆందోళ‌న చెందుతుండ‌టం గ‌మ‌నార్హం. 



మరింత సమాచారం తెలుసుకోండి: