వైఎస్ జగన్ కొన్ని విషయాల్లో చాలా సీరియస్ గా ఉంటాడు.  మొన్నటి వేరే పార్టీల్లోని నాయకులను ఆహ్వానించే విషయంలో జగన్ ఆచి తూచి అడుగులు వేసిన సంగతి తెలిసిందే.  ఈ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అన్నది తెలియాల్సి ఉన్నది.  జగన్ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి. ఎలా జగన్ వాటిని గెలవబోతున్నారు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నది. 


ప్రతిపక్షాలు జగన్ ను ఇబ్బంది పెట్టాలని చూసిన ప్రతీసారి ఆ పార్టీల నుంచి నేతలను తమ పార్టీలోకి లాగేసుకుంటున్నారు.  ఇందులో భాగంగానే జగన్ కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకున్నారు.  ఈ విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం మేరకు అమలు జరగాల్సి ఉన్నది.  అందులో కొన్ని కీలకంగా మారాయి.  అవేంటంటే.. నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు ఇసుక దీక్ష చేసిన సంగతి తెలిసిందే.  ఇసుక దీక్ష చేసే సమయంలోనే దేవినేని అవినాష్ కండువా మార్చేశారు.  


వైకాపాలో జాయిన్ అయ్యారు.  వైకాపాలో ఇప్పటికే అనేకమంది ఉన్నారు.  151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.  దేవినేని అవినాష్ కు విజయవాడలో మంచి పట్టు ఉన్నది.  విజయవాడలోని మూడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో రెండింటిలో వైకాపా గెలిస్తే.. తూర్పు నియోజక వర్గంలో మాత్రం తెలుగుదేశం పార్టీ గెలిచింది.  అక్కడ నేతను మార్చాలని జగన్ చూస్తున్నారు.  


ఆ ఏరియాలో అవినాష్ కు పట్టు ఉండటంతో.. అవినాష్ కు ఆ బాధ్యతలు అప్పగిస్తారని అనుకుంటున్నారు.  ఆ బాధ్యతలు అప్పగిస్తే.. అవినాష్ ద్వారా అక్కడ పట్టు సాధించవచ్చు అన్నది జగన్ ఉద్దేశ్యం. జగన్ ప్రయత్నం సక్సెస్ అవుతుందేమో చూడాలి.  ఒకవేళ అవినాష్ కు ఈ బాధ్యతలు అప్పగిస్తే ఏ మేరకు సక్సెస సాధిస్తాడో చూడాలి.  మొత్తానికి బాబు దీక్ష చేపట్టిన రోజునే డబుల్ షాక్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు జగన్.  


మరింత సమాచారం తెలుసుకోండి: