వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం విస్తరించిన సంగ‌తి తెలిసిందే. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఇటీవ‌లే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లోనూ ఎంపిక చేసిన ఆసుపత్రిల్లో ఆరోగ్యశ్రీ పథకం వర్తించ‌నున్న‌ట్లు తెలిపారు. ఏపీలో లేని కొన్ని వైద్యసేవలు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఉండటంతో అక్కడ కూడా ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి సంబధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.

* 5 లక్షల వరకు వార్షిక ఆదాయం  ఉన్నవారికి కూడా వైఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ పథకానికి  వర్తింపజేస్తూ ఆదేశాలు 
  • అన్ని రకాల బియ్యం కార్డు కల్గిన వారు అర్హులే.
  • వైయస్ఆర్ పెన్షన్ కనుక కార్డు, జగన్నన్న విద్యా, వసతి దీవేన కార్డుకు అర్హత ఉన్న కుటుంబాలు కూడా అర్హులు. ఇతర కుటుంబాలకు, ఈ క్రింది ప్రమాణాలు వర్తిస్తాయి.
  • 12 ఎకరాల కన్నా తక్కువ  తడి భూమి, 35 ఎకరాల కన్నా తక్కువ పొడి భూమి ఉన్న భూ యజమానులు అర్హులు.
  • తడి, పొడి భూములు కలిపి  మొత్తం 35 ఎకరాల కన్నా తక్కువ ఉన్న వారందరూ అర్హులు. 
  • వార్షిక ఆదాయం 5 లక్షల కంటే తక్కువ లేదా  ఎక్కువ ఉన్న కుటుంబాలకు  అర్హులు.
  • 5.00 లక్షల వరకు  ఆదాయపు పన్ను దాఖలు చేస్తున్న కుటుంబాలు అర్హులు
  • 3000 SFT (334 చదరపు Yds) కన్నా తక్కువ ప్రాంతానికి మునిసిపల్ ఆస్తి పన్ను చెల్లించే కుటుంబాలకు వర్తింపు 
  • 5.00 లక్షలోపు వా ర్షిక ఆదాయం ఉన్న    అవుట్ సో ర్సింగ్, కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, అర్హులు
  • ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న  గౌరవ వేతనం  ఆధారిత ఉద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు  అర్హులు 
  • కుటుంబంలో ఒక కారు ఉన్నా వైెఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ పథకం వర్తింపు
  • కుటుంబంలో ఒక కారు కన్నా ఎక్కువగా ఉంటే పథకానికి అనర్హులుగా తెలిపిన ప్రభుత్వం


మరింత సమాచారం తెలుసుకోండి: