వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ప్ర‌స్తుత ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు గురించి..జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అంబ‌టికి ప‌ద‌వి ఎందుకు ద‌క్క‌లేదో...త‌న‌కు తెలుస‌ని చెప్పిన ప‌వ‌న్...త‌న‌పై విమ‌ర్శ‌లు చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే....ఆయ‌న‌కు అమాత్య హోదా ద‌క్క‌లేద‌ని ప‌వ‌న్ విశ్లేషించారు. దీనిపై తాజాగా అంబ‌టి ఘాటుగా స్పందించారు. ``జగన్‌కు అటు ఇటు అయితే మీ పరిస్థితి ఏంటి అని పవన్ కల్యాణ్ అడుగుతున్నారు. నీవు, చంద్రబాబు కలసి జగన్ గారిని ఏం చేయదలుచుకున్నారు.? ఒక‌వేళ‌, జగన్‌కు అటైనా, ఇటైనా, ఎటైనా జగన్ గారి వెంటే నడుస్తాం`` అని స్ప‌ష్టం చేశారు. 


మంత్రి బొత్స త‌న‌ను విమర్శిస్తే 3 నెలల మంత్రి పదవి ఎక్స్ టెన్సన్ వస్తుందని, అంబటి విమర్శించకపోవడం వల్ల మంత్రి పదవి రాలేదని ప‌వ‌న్ అన‌డం చిత్రంగా ఉంద‌ని రాంబాబు అన్నారు. `మా పార్టీ పరిస్దితి అటుంచండి.మీరు జగన్‌ను పదే పదే విమర్శిస్తున్నారే. మీకు ఎక్కడినుంచి ప్యాకేజిలు వస్తున్నాయి? వాటి గురించి ఆసక్తితో మీరు ఎగేసుకుని మాట్లాడుతున్నారా? మీ కార్యకర్తలు ఏం మాట్లాడుకుంటున్నారో పిలిచి అడగండి. మీ చుట్టూ ఉన్న నేతలను మీ గురించి ఏమనుకుంటున్నారో అడగండి. తెనాలిబాబు,లింగమనేని బాబులు కలసి మిమ్మల్ని చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లి ప్యాకేజిలు మాట్లాడిన సంగతి అందరికి తెలుసు. చంద్రబాబు ఎవరికి చెబితే వారికి టిక్కెట్లు ఇచ్చి మీ పార్టీని మీరే సర్వనాశనం చేసుకున్నారని అంటుంటే వారిని చూసి జాలివేస్తుంది..ఎవరో ఆయిల్ కొడితే మీ బండి న‌డుపుకొంటే ఎలా? మీ ఆయిలే మీరు కొట్టుంచుకుని బండినడుపుకుంటే ఎంతబాగుంటుంది.దాని కిక్కే వేరప్ప.`` అంటూ ఎద్దేవా చేశారు.


ప‌వ‌న్ క‌ళ్యాణ్ పదే పదే పెళ్లాలు గురించి మాట్లాడుతుండ‌టం....మీరు కూడా చేసుకోండి అంటుండ‌టం స‌రికాద‌ని అంబ‌టి అన్నారు. `అయ్యా మీరు తప్పుచేశారని చెబితే, మీరు కూడా తప్పులు చేయండి అని మాట్లాడుతున్నారు.ఇది ఆయన పరిస్దితి.`` అని కామెంట్ చేశారు. పవన్ కల్యాణ్‌ను ఢిల్లీకి చంద్రబాబు తన దూతగా పంపించి ఉంటాడనేది త‌న‌ అనుమానని అంబ‌టి అన్నారు. ఆయన రాష్ర్ట ప్రయోజనాలకోసం వెళ్లాడని తాను భావించడంలేదని తెలిపారు. ఢిల్లీ వెళ్లివచ్చాక పవన్ కల్యాణ్ ఎందుకు వెళ్లాడో చెప్తాడని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: