టీడీపీ అధినేత చంద్రబాబు భోజనం చేయకుండా అయిన ఉంటారేమో గాని మాత్రం పొత్తు లేకుండా ఉండలేరు అనుకుంటా. ఆయన టీడీపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకొచ్చిన దగ్గర నుంచి పొత్తు లేకుండా ఏ ఎన్నికలకు వెళ్లలేదు. ఇక మొన్న ఎన్నికల్లో పొత్తు లేకపోవడం వల్ల ఎంత దారుణ పరాజయం పొందారో అందరికీ తెలుసు. అందుకేనేమో ఓడిపోయిన దగ్గర నుంచి పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు. 


సరే బీజేపీ అంటే కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి అవసరముందని వెంట పడుతున్నారు అనుకోవచ్చు. కానీ పవన్ కల్యాణ్ విషయంలో ఏం చూసి బాబు వెంటపడుతున్నారో తెలుగు తమ్ముళ్ళతో పాటు, జనంకు కూడా అర్ధం కావడం లేదు. అసలు రాష్ట్ర స్థాయిలో టీడీపీతో పోల్చుకుంటే చూసుకుంటే బీజేపీకి,జనసేనలకు అంత సీన్ లేదు. 


బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి దాన్ని పక్కనబెట్టేస్తే, జనసేనకు రాష్ట్రంలో పెద్ద పట్టు లేదు. టీడీపీకి ఉన్న కేడర్ అస్సలు లేదు. అంతకుమించి బాబుకు ఉన్న అనుభవం ముందు నిలకడ లేని రాజకీయాలు చేస్తున్న పవన్ వల్ల ఎందులోనూ ఉపయోగం లేదు. పైగా ఎన్నికల్లో కూడా పవన్ సత్తా ఏంటో కూడా అర్ధమైంది. మరి ఇలా ఉన్న పవన్ వెనుక బాబు పడుతుండటం తెలుగు తమ్ముళ్ళకు అసలు రుచించడం లేదు.


ఏదో పవన్ వెనుక కుర్రాళ్ళు ఎగబడి వచ్చిన వారిలో ఓటు లేని వారు, జనసేనకు ఓటు వేయనే వారు ఉన్నారు. ఈ విషయం పవన్ కు కూడా తెలుసు. ఒకవేళ పార్టీ యూత్ అవసరం అనుకుంటే టీడీపీలోనే యువనేతలకు కొదువ లేదు. రామ్మోహన్ నాయుడు, పరిటాల శ్రీరామ్, కరణం వెంకటేష్, జే‌సి సోదరులు, అఖిలప్రియ, ఆదిరెడ్డి భవాని, బండారు శ్రావణి, చింతకాయల విజయ్ ఇలా చాలామందే యువ నాయకులు ఉన్నారు. 


వీరిని ఒక్కసారి యాక్టివ్ చేసి రంగంలోకి వదిలితే పరిస్తితి మారిపోతుంది. ఇంత బలం ఉన్న బాబు...ఇంకా పవన్ పొత్తు కోసం వెంటపడటం వల్ల ప్రజల్లో కూడా నెగిటివ్ పెరుగుతుంది. ఇప్పటికే పొత్తు లేకపోతే టీడీపీ గెలవలేదని ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఇది పూర్తిగా జనంలోకి వెళ్ళేలోపు తేరుకోలేకపోతే అంతే సంగతులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: