ఎప్పుడు చేసిన తప్పులకు అప్పుడే శిక్ష అనుభవిస్తారట....అలాగే మొన్నటివరకు జగన్ ని ఎగతాళి చేసిన చంద్రబాబు ఇప్పుడు బాగా అనుభవిస్తున్నారు. ఆ పార్టీ నేతలు వైసీపీలోకి వస్తూ.. బాబుని తిడుతుంటే జగన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు...జగన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో అందరికీ తెలుసు. బాబు అండ్ కొ జగన్ ని ఎగతాళి చేసి పైశాచిక ఆనందం పొందారు. అసెంబ్లీలో గానీ, బయట ఏమైనా ధర్నాలు చేసేటప్పుడుగానీ వైసీపీని ముప్పుతిప్పలు పెట్టారు.


ఇక ఇదొక ఎత్తు అయితే వైసీపీ ఎమ్మెల్యేలని పార్టీలోకి తీసుకుంటూ, వారి చేత జగన్ పై తీవ్ర విమర్శలు చేయించారు. పైగా ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి లాంటి వారు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో కూడా చూశాం. అలాగే ఆదినారాయణరెడ్డి అయితే అసెంబ్లీ, సభల్లో జగన్ పై సెటైర్లు వేస్తుంటే బాబు ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు. అసలు ప్రతి విషయంలో బాబు... జగన్ ని ఎగతాళి చేస్తూనే వచ్చారు. 


అయితే పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. ఎన్నికలు వచ్చాయి. బాబు ఘోరంగా ఓడిపోయాడు. జగన్ భారీ మెజారిటీతో గెలిచి సీఎం అయిపోయారు. ఇక ఇక్కడ నుంచి సీన్ రివర్స్ అయింది. జగన్ మంచిగా పరిపాలన చేస్తూనే గతంలో బాబు చేసిన దానికి సైలెంట్ గా బదులు తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చే నేతలు బాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. తాజాగా వల్లభనేని వంశీ అయితే బాబుని చెడామడా తిట్టేశారు. ఒక్కసారిగా బాబు గాలి తీసేశారు. 


ఈ మాటల ప్రభావం ఇసుక దీక్ష చేస్తున్న సమయంలో బాగా కనిపించింది. దెబ్బకు బాబు ముఖం తెల్లబోయినట్లు అయిపోయింది. ఓ ఫ్రస్టేట్ అయిపోయి ఏం మాట్లాడారో తెలియకుండా మాట్లాడేశారు. అయితే బాబుని చూస్తే జగన్ కూడా మనసు లోపల బాగా ఆనందించి ఉంటారు. మొత్తానికైతే ఈ ఐదేళ్లు జగన్‌కు ఫన్....బాబుకు ఫ్రస్టేషన్ తప్పదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: