రోజు రోజుకు నిరుద్యోగ సమస్య ఎక్కువవుతుంది. చదువుకున్న వారు సైతం సరైన ప్రయత్నాలు చేయలేక చదివిన చదువును గాలికి వదిలేసి జులాయిగా తిరుగుతున్నారు. లేదా అరకొర జీతాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఇలాంటి వారు ఏకాగ్రతతో ప్రయత్నిస్తే మంచి జాబులు ఎందుకు రావండీ. ఈ మధ్యకాలంలో ఎన్నో ఉద్యోగాల ప్రకటనలు  వెలువడుతున్నాయి. వాటిలో మనం సెలక్ట్ అవుతామా లేదా అనేది ముఖ్యం కాదు. మనం ఎంతవరకు ప్రయత్నించాం అనేది ముఖ్యం.


ఇకపోతే  తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్-TSSPDCL ఇటీవల భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టిన సంగతి తెలిసిందే. జేఎల్ఎం, జేపీఓ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. 500 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తుకు నవంబర్ 20 చివరి తేదీ...  ఈ  నోటిఫికేషన్ల ద్వారా తెలంగాణ విద్యుత్ సంస్థ 2500 జూనియర్ లైన్‌మెన్, 25 జూనియర్ పర్సనల్ ఆఫీసర్, 500 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.


కొద్ది రోజుల క్రితం తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ మొత్తం 3025 పోస్టుల భర్తీకి వేర్వేరుగా మూడు నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా జూనియర్ లైన్‌మెన్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. 500 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు అక్టోబర్ 30న ఫీజు పేమెంట్, అక్టోబర్ 31న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా నోటిఫికేషన్‌లో వెల్లడించింది. 


జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు అభ్యర్థులు మొదట ఫీజు చెల్లించిన తర్వాత అప్లై చేయాలి, ఇక ఇందుకు గాను వయస్సు 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి. ఇదే కాకుండా బీఏ, బీఎస్సీ, బీకామ్ డిగ్రీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పాసైనవారు జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు రూ.100, ఎగ్జామ్ ఫీజు రూ.120. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు పరీక్ష ఫీజులో మినహాయింపు ఉంటుంది.


ఈ అభ్యర్థులు 2019 నవంబర్ 20 సాయంత్రం 5 గంటల్లోగా ఫీజు చెల్లించాలి. 2019 నవంబర్ 20 రాత్రి 11.59 గంటలు లోగా దరఖాస్తు చేయాలి. ఇకపోతే 2019 డిసెంబర్ 22న జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు పరీక్ష ఉంటుంది. హాల్ టికెట్లు 2019 డిసెంబర్ 11 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు


మరింత సమాచారం తెలుసుకోండి: