కొడాలి నాని .. జగన్ క్యాబినెట్ లో మంత్రి. ఇంకా చెప్పాలంటే జగన్ కు బాగా నచ్చిన ఎమ్మెల్యే. కొడాలి నాని తన నియోజకవర్గంలో స్వంత బలంతో గెలవగల నేత. అయితే తాజాగా ఇప్పుడు కొడాలి జగన్ కు కొత్త పేరు పెట్టారు. ఏపీలోని 47వేల స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి దేశంలోనే ఏ సీఎం సాహసించని రీతిలో జగన్ చేసిన ధైర్యంపై ఇంటా బయటా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇన్నాళ్లు ఎన్నికల ముందు వరకూ అందరూ ‘జగనన్నా’ అంటూ జగన్ ను ముద్దుగా పిలిచేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల దశాదిశా మారుస్తూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన జగన్ ను ముద్దుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులంతా ‘జగన్ మామా’ అంటూ పిలుస్తున్నారట. ఇదే విషయాన్ని తాజాగా మంత్రి కొడాలి నాని ప్రస్తావించి జగన్ కు కొత్త పేరు పెట్టారు.


ఏపీలోని అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతీ తెలిసిందే. రాష్ట్రంలోని పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియం చదువులతో భవిష్యత్తును పంచిన జగనన్న ఇక ‘జగన్ మామ’ అని చెప్పుకొచ్చాడు. ఆ పిల్లలందరికీ జగన్ మేనమామ అయిపోయాడని తెలిపారు. వాళ్లంతా అలానే పిలుస్తున్నాడని చెప్పుకొచ్చాడు.ఇక ఇంగ్లీష్ పై రచ్చ చేస్తున్న టీడీపీ నేతలను కడిగేశాడు కొడాలి నాని.. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆయన తండ్రి  ఎర్రన్నాయుడు బాగా చదువుకొని ఇంగ్లీష్ నేర్చుకోవడంతోనే చంద్రబాబు వాళ్లను ఢిల్లీకి ఎంపీలుగా పంపారని.. ఎర్రన్నాయుడి తమ్ముడు అచ్చెన్నాయుడుకు ఇంగ్లీష్ రాకనే విజయవాడలోనే తిరుగుతున్నాడని కొడాలి నాని ఎద్దేవా చేశారు.


రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలు పిల్లలు మాత్రం ఇంగ్లీష్ బడుల్లో చదవాలి .. పేద ప్రజలు మాత్రం తెలుగు మీడియంలో చదవాలా అని కొడాలి విమర్శించారు.  ఇంకా కొడాలి ఇసుక గురించి మాట్లాడుతూ .. ఇసుక కొరత ప్రభుత్వం సృష్టించింది కాదని... ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు ఆధారాలు చూపించమంటే పారిపోయారని ఆయనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసేవి దొంగ దీక్షలని.. దీక్షలు చేసే అర్హత ఆయనకు లేదని మండిపడ్డారు. ఇసుక దోపిడీని అడ్డుకున్న అధికారులపై తెలుగుదేశం శాసన సభ్యులు దాడి చేశారని గుర్తు చేశారు. లోకేష్ కనుసన్నల్లో నడుస్తున్న బ్లూ ఫ్రాగ్ సంస్థ ద్వారా కృత్రిమ ఇసుక కొరతను సృష్టించారని నాని ఆరోపణలు చేశారు. బ్లూ ఫ్రాగ్ సంస్థ ద్వారా ఇసుక వెబ్సైట్ను హ్యాక్ చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇసుక మాఫియా కింగ్ అని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: