“మానవహక్కులు ఉల్లంఘన” పై వాషింగ్టన్‌ వేదికగా జరుగుతోన్న "యూఎస్ కాంగ్రెషనల్ కమీషన్ హియరింగ్ ” లో భారత్ తరఫున ప్రముఖ ‘కశ్మీరీ కాలమిస్ట్’ సునంద వశిష్ఠ్‌ పాల్గొన్నారు.   అంతర్జాతీయస్థాయి ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పాకిస్థాన్‌ తీరును ఎండగట్టిన సునంద వశిష్ఠ్‌ కశ్మీర్‌ జోలికొస్తే సహించబోమని హెచ్చరించారు. తిరుగుబాటు దాడులను తరిమికొట్టడం తమకేం కొత్తకాదంటూ దాయాదికి చురకలు అంటించారు. 


ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదుల మూలంగా నేటి సిరియాలో మాదిరిగా నాడు కశ్మీర్‌ కూడా కౄరత్వానికి బలై నేటికీ సాక్షి గా నిలిచిందని, అక్కడ భయానక పరిస్థితులను స్వయంగా అనుభవించామని సునంద వశిష్ఠ్‌ వాపోయారు.  30 ఏళ్ల కిందట పాకిస్థాన్‌ నీడలో పెరిగిన ఇస్లామిక్ ఉగ్రవాదం, ఆ ఉగ్రమూకల దాడుల్లో ముఖ్యంగా తన కుటుంబం భారీగా నష్టపోయిందని, నివాసాలతో సహా జీవితాలను కూడా కోల్పోయామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


Image result for Sunanda vasisht on US congressional commission

భారత్‌ ప్రజాస్వామ్యాన్ని విజయవంతంగా కాపాడుకుంటుందని సునంద వశిష్ఠ్‌ పేర్కొన్నారు. పంజాబ్‌, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు మూలంగా మానవ హక్కులకు విఘాతం ఏర్పడితే దాన్ని సమర్థంగా నియంత్రించుకున్నామని తెలిపారు. ఇప్పుడు కూడా ఉగ్రవాద తిరుగుబాటుపై వ్యతిరేకంగా పోరాటం చేసే భారత్‌ను బలపర్చాల్సిన సమయం ప్రపంచదేశాలకు ఆసన్నమైందని ఆమె పిలుపు నిచ్చారు. మానవ హక్కుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాల్సిన తరుణం ఇదేనని ఆమె అన్నారు.


ఇప్పటికి కూడా పాకిస్థాన్‌ ఉగ్రనీడలో పెరిగిన ఉగ్రమూకలు కశ్మీర్‌లో అనేక దాడులకు పాల్పడుతున్నాయని అక్కడ వినిపించే చావుకేకలకు పాకిస్థాన్‌ పెంచి పోషించిన ఉగ్రతండాలే కారణమని దుయ్యబట్టారు.  కానీ, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఉగ్రవాద నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించి అంతర్జాతీయ సమాజాన్ని నిలువునా దగా చేస్తున్నారని సునంద ధ్వజమెత్తారు. 

Image result for Sunanda vasisht on US congressional commission

ఇమ్రాన్ ఖాన్  “రెండు నాల్కల ధోరణి” తో ఎవరికీ ప్రయోజనం ఉండదని ఆమె ఉద్ఘాటించారు. ఇస్లామిక్‌ ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అంతర్జాతీయ స్థాయిలో మద్దతు అవసరమని సునంద అభిప్రాయపడ్డారు. ఇప్పుడు కశ్మీర్‌లో మానవహక్కులు ఉల్లంఘనలు జరగుతున్నాయని గగ్గోలు పెడుతున్నవారు, తమకు అంటే నాడు కాశ్మీర్ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఏమైపోయారని సునంద వశిష్ఠ ప్రశ్నించారు. 


కశ్మీర్‌ లో హిందూ పురుషుల కాకుండా కేవలం వారి మహిళలు మాత్రమే ఉండాలని 1990 జనవరి 19 రాత్రి లోయ లోని అన్ని మసీదుల నుంచి ప్రకటనలు వెలువడ్డాయని గుర్తు చేశారు. ఈ ప్రకటనకు భయపడి పోయిన మా తాత వంట గదిలోని కత్తులు, తప్పు పట్టిన రంపంతో నన్ను, నా తల్లిని చంపడానికి సిద్ధమైనప్పుడు మానవత్వాన్ని రక్షించే వారు ఎక్కడున్నారని ఆమె గద్గధిక కఠంతో నిలదీశారు. 

Image result for Sunanda vasisht on US congressional commission

* ప్రాణాలతో ఉండాలంటే పారిపోవడం *మతం మారడం * చావటం ఏదో ఒకటి తేల్చుకోవాలని అంటూ ఉగ్రవాదులు హిందూ జాతికి మూడు అవకాశాలు ప్రకటించారని అన్నారు. భయానకమైన ఆ రాత్రి తర్వాత దాదాపు 4 లక్షల మంది హిందువులు కశ్మీర్ నుంచి ప్రాణభయంతో పారిపోయారన్నారు. కొందరు ప్రాణాలతో బయటపడితే, ఇంకొందరు ఉగ్రవాదుల చేతిలో బలయ్యారని, ఇది జరిగిన 30 ఏళ్ల తర్వాత కూడా కశ్మీర్‌ లోని నా ఇంటికి వెళ్లే పరిస్థితి ఇప్పటికీ లేకపోయిందని వివరించారు. 


నా విశ్వాసాన్ని అనుసరించడానికి అనుమతి లేదని, కశ్మీర్‌ లోని తన ఇంటిని చట్ట విరుద్ధంగా ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు. సునంద వశిష్ఠ్ వ్యాఖ్యలపై టెక్సాస్‌ కు చెందిన india NATIONAL CONGRESS' target='_blank' title='కాంగ్రెస్‌-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కాంగ్రెస్‌ ప్రతినిధి షీలా జాక్సన్‌ లీ స్పందించారు.  కశ్మీర్‌ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిని వివరించాలని ఆమె కోరారు.  అమెరికా కాంగ్రెస్‌కు చెందిన కొందరు ప్రతినిధుల బృందం కశ్మీర్‌లో పర్యటించాలని అనుకుంటోందని, అందుకు భారత ప్రభుత్వం కూడా అనుమతించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: