తెలుగుదేశం పార్టీపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మరోసారి విరుచుకుపడ్డారు... నాకు నీతులు చెప్పిన తెలుగుదేశం నేతలకు పుష్పాంజలి అంటూ మొదలుపెట్టిన వంశీ... నన్ను తయారు చేసిన చంద్రబాబు నీ పుత్రరత్నాన్ని ఎందుకు తయారు చేయలేదని ప్రశ్నించారు. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలకు నేను చాలా బాధపడ్డానని.. రాజేంద్ర ప్రసాద్ పెద్ద వాడు కాబట్టి క్షమాపణ చెప్తున్నా అన్నారు. ఆయనలా నేను సౌమ్యంగా మాట్లాడలేననని వంశీ వ్యాఖ్యానించారు. 


మన పార్టీ ఓడిపోయింది మనమంతా రాజకీయం చేద్దాం, నేను ఎందుకు రాజీనామా చెయ్యాలని ప్రశ్నించారు. ఇక లోకేష్ ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో గెలవలేని వాళ్ళు నన్ను విమర్శిస్తున్నారన్న ఆయన... నన్ను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలని లోకేష్ అంటున్నారు ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. లోకేష్ ని పప్పు అని నేను అనలేదు రామ్ గోపాల్ వర్మ అన్నాడన్నారు. పార్టీ మారిన ఎంపీలను సస్పెండ్ చేయమని ఢిల్లీ వెళదాం రండని, లోకేష్ రా మోదీ ఇంటి ముందు టెంట్ వేద్దామంటూ వ్యాఖ్యానించారు.

బొమ్మరిల్లులో ప్రకాష్ రాజ్ లా అన్నీ మీరే చెప్తారని ఎద్దేవా చేసిన ఆయన... చంద్రబాబు కాళ్లకు దండం పెడితే తప్పేంటి అని నిలదీశారు. మొఖానికి రంగులు వేసుకునే వాళ్ళు రాజకీయాలకు పనికి రారని చంద్రబాబు అనలేదా  అని ప్రశ్నించారు. నేనేమైనా టీటీడీ చైర్మన్ పదవి అమ్ముకున్నానా, నేను ఏమైనా వేయి కాళ్ళ మండపం పడగొట్టానా అని ప్రశ్నించారు. నాకు ఈ పదవి అవసరం లేదు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని స్పష్టం చేశారు. 


మాలతో ఉన్న నన్ను రాజేంద్ర ప్రసాద్ తిట్టొచ్చా అని ప్రశ్నించారు. నేను రాజకీయాల్లోకి రాక ముందే నాపై కేసులు ఉన్నాయన్న వంశీ... ఏపీలో నాకు ఎకరం పొలం లేదు రైతుల కోసమే నేను జగన్ ని కలిసా అని స్పష్టం చేశారు. చంద్రబాబు సొంత జిల్లాలోనే టీడీపీ కనుమరుగు అవుతుందని వంశీ జోస్యం చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: