ఎన్నికల్లో బాగా ఫేమస్ అయిన బై బై బాబు నినాదం ఎన్నికల తర్వాత కూడా బాగానే నడుస్తుంది. కాకపోతే ఎన్నికల్లో ప్రత్యర్ధి పార్టీ వైసీపీ నేతలు వాడితే....ఇప్పుడు సొంత టీడీపీ నేతలే వాడుతున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు బై బై బాబు అని చెప్పేసి...వైసీపీ, బీజేపీల్లోకి చేరిపోయారు. ఇంకా మరికొందరు నేతలు కూడా అదే పనిలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే టీడీపీలో ఎన్నో ఏళ్లుగా కీలక పాత్ర పోషిస్తున్న బీసీ వర్గానికి చెందిన సీనియర్ కేఈ బ్రదర్స్ కూడా బై బై చెప్పనున్నారని తెలుస్తోంది.


ఇప్పటికే వీరు వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్ళారని, నవంబర్ 29న జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన కేఈ కృష్ణమూర్తి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. అలాగే 2014 ఎన్నికల్లో పత్తికొండ నుంచి గెలిచి బాబు కేబినెట్ లో డిప్యూటీ సీఎం పదవితో పాటు పలు శాఖల బాధ్యతలు కూడా చేపట్టారు. ఇక 2019 ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకుని తనయుడు శ్యామ్ బాబుని పత్తికొండ నుంచి బరిలోకి దింపారు. 


కానీ శ్యామ్ అనుహ్యాంగా ఓటమి పాలయ్యారు. అటు డోన్ నుంచి ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ కూడా ఓటమి పాలయ్యారు. ఇక ఓటమి దగ్గర నుంచి టీడీపీతో అంటీముట్టనట్లుగా ఉంటున్న  కేఈ బ్రదర్స్  వైసీపీలోకి వెళ్ళడం ఫిక్స్ అయిపోయిందని వైసీపీ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. అయితే కేఈ బ్రదర్స్ కూడా వైసీపీలోకి వెళితే కర్నూలులో టీడీపీని ఆదుకునే నాథుడే ఉండరు. మొన్న ఎన్నికల్లో ఎలాగో జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.  మరి కేఈ బ్రదర్స్ కూడా జంప్ అయితే టీడీపీ గతి అధోగతే. 


మరింత సమాచారం తెలుసుకోండి: