గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఓ మీడియా ఛాన‌ల్ చ‌ర్చాగోష్టిలో టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్‌పై ఆయ‌న విరుచుకుప‌డ్డారు. టీడీపీ నేత రాజేంద్రప్రసాద్‌పై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయ్యప్ప మాలలో ఉండి ఇంత పచ్చిగా మాట్లాడతారా అంటూ టీడీపీ నేతలు కౌంటర్‌ ఇచ్చారు. అయితే ఈరోజు మీడియా ముందుకొచ్చిన వంశీ.. అయ్యప్ప మాల వేసుకొని ఏదేదో చేశానని మాట్లాడుతున్నాన‌ని, మాల వేసుకున్న నన్నెందుకు తిట్టాడని అందరూ అంటున్నారని వంశీ పేర్కొన్నారు. అయితే, తానేమైనా టీటీడీ బోర్డు, మెంబర్‌ పదవులు అమ్ముకున్నానా?, వెయ్యి కాళ్ల మండం కూల్చానా, దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేశానా? అని వంశి ప్రశ్నించారు.  ఈ ప్రశ్నలకు బాబు సమాధానం చెప్పాలని వంశి ఈ సందర్భంగా పేర్కొన్నారు.  


చాలా కూల్‌గా పద్దతిగా.. అద్భుతమైన సాహిత్య భాషతో చురకలంటించారు. ఇదే స‌మ‌యంలో రాజేంద్రప్ర‌సాద్‌కు క్షమాపణలు చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను బట్టే తాను అలా మాట్లాడవలసివచ్చిందని అన్నారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబేనని.. అలా అని చంద్రబాబుకు కూడా కాంగ్రెస్‌ రాజకీయ భిక్ష పెట్టిందని.. ఆయన కూడా కాంగ్రెస్‌లోనే ఉన్నారా అని వంశీ సూటిగా ప్రశ్నించారు. తన ఒక్కడి విషయంలోనే నైతిక విలువలు బాబుకు కనిపించాయా అని ప్రశ్నించారు వంశీ. చంద్రబాబు తన తండ్రి లాంటి వారని ఆయన కాళ్లకు దండం పెడితే తప్పేంటని అన్నారు. అలా అని కాళ్లు పట్టుకోలేదని రెండింటికి తేడా ఉందని వంశీ చెప్పారు. తన వ్యక్తిగత పనులకు చంద్ర బాబు కోట్ల రూపాయలు ఇవ్వలేదని… ఎన్నికలప్పుడు ఏ పార్టీ అయినా ఫండ్ ఇస్తుందని చెప్పారు. 2014 ఎన్నికలలో ఆ ఫండ్ కూడా ఇవ్వలేదని… తాను మనీ తీసుకున్నానని రాజేంద్రప్రసాద్‌ అనే సరికి బాధపడ్డానని వంశీ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: