ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సమయం నుంచి సంచలన నిర్ణయలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎంతోమంది పేదలకు ఉపయోగ పడే ఆరోగ్య శ్రీ పథకంలోకి కొత్తగా వచ్చే వారికీ జనవరి నుంచి సేవలు అందించనుంది. 

              

తాజా ఉత్తర్వుల 35 ఎకరాలు లోపు భూమి ఉన్నవారికి ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది అని, అలాగే వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు లేదా రూ.5 లక్షల వరకూ ఆదాయం ఉన్న వారికీ ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది అని, 3 వేల చదరపు అడుగులు లేదా 334 చదరపు గజాలలో ఇల్లు ఉండి ఆస్తిపన్ను చెల్లించేవారు కూడా ఆరోగ్య శ్రీకి అర్హులే అని తాజాగా చెప్పారు. 

                 

అంతేకాదు ఒక ఇంటికి ఒక కారు ఉన్న కూడా ఆరోగ్య శ్రీకి అర్హులేనని ఇందులో చెప్పారు. ప్రస్తుతం బియ్యం కార్డులు, వైఎస్ఆర్ పించన్ కానుక కార్డు, జగనన్న విద్య, వసతి దీవెన కార్డుదారులకు ఆరోగ్య శ్రీ వర్తింప జేస్తున్నారు. అయితే ఇప్పటికే 1.60 కోట్ల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ది జరుగుతుంది. 

                   

తాజా నిర్ణయాలతో ఆరోగ్యశ్రీలోకి అడుగు పెట్టె కొత్తవారికి జనవరి నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రూ. 5లక్షల వార్షికాదాయం ఉన్న వారికీ కూడా ఈ పథకం వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో మరో 4-5 లక్షల కుటుంబాలకు ఈ పథకం అందనుంది. ఈ మేరకు ఈ నెల 20 నుంచి గ్రామా సచివాలయాల ద్వారా లబ్దిదారులకు గుర్తించి వారికీ త్వరలో ఆరోగ్య శ్రీ కార్డులు అందించనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: