ఇటీవ‌లే...వైసీపీలో చేరిన తెలుగుదేశం పార్టీ యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు దేవినేని అవినాష్ గురించి...వైసీపీ నేత‌, ఏపీ మంత్రి కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ నేత‌లు, చంద్ర‌బాబు తీరుపై ఆయ‌న విరుచుకుప‌డ్డారు.  తాను చంద్రబాబు విధానాలతో విభేదిస్తున్నానని, వైయస్‌ జగన్‌ విధానాలకు మధ్దతు పలుకుతున్నాను అని వంశీ ప్రకటించాడే త‌ప్పించి... వైయస్‌ జగన్ ఆయ‌నకు కండువా కప్పలేదని ప్ర‌క‌టించారు.


ఈ సంద‌ర్భంగా దేవినేని అవినాష్ గురించి నాని వివ‌రించారు. త‌న‌పై అవినాష్‌ పోటీ చేస్తున్న స‌మ‌యంలోనే ఆయ‌న‌కు ప‌లు సూచ‌న‌లు చేశాన‌ని నాని వివ‌రించారు. ``నీవు చిన్నపిల్లవాడివి. నీకు తండ్రిలేడు. చంద్రబాబు పెద్ద లుచ్చాగాడు...ఆయ‌న్ను నేను చాలా దగ్గర్నుంచి చూశాను.మోసం, మాయ చేస్తున్నాడు నీవు నమ్మకు అని చెప్పాను. అయినా గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు గుడ్డిగా వచ్చి మోసపోయిన వ్యక్తి అవినాష్‌.`` అని వెల్ల‌డించారు. అవినాష్‌ గురించి చెప్పడానికంటే ముందు ఆయ‌న తండ్రి దేవినేని నెహ్రూ గురించి చెప్పాల‌ని నాని అన్నారు.  ``ఎన్టీఆర్‌తో కలసి నెహ్రూ రాజకీయాలలోకి వచ్చాడు. రామారావు బతికి ఉన్నంత కాలం ఆయన పరిస్దితి బాగోకపోయినా ఆయనను వదిలివేసి రాలేనని చెప్పి ఎన్టీఆర్‌ ఆఖరి శ్వాస వరకు నెహ్రూ అక్కడే ఉన్నాడు. ఆ సమయంలో చంద్రబాబును ఎవ్వరూ తిట్టనంత విధంగా ఎన్టీఆర్‌కు ద్రోహం చేశాడు, ద్రోహీ అని భయంకరంగా తిట్టిన వ్యక్తి దేవినేని నెహ్రూ.  ఎన్టీఆర్ మ‌ర‌ణం తర్వాత కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లారు. కాంగ్రెస్‌ పార్టీ తుడిచిపెట్టుకుపోయాక ఇబ్బందులు పడుతున్న టైంలో కుమారుడు భవిష్యత్తు కోసం నాలుగుమెట్లు కిందకు దిగి దుర్మార్గుడు,దుష్టుడు అయిన చంద్రబాబు వద్దకు వెళ్లి చేతులు పట్టుకుని నా కుమారుడిను నీ చేతుల్లో పెడుతున్నాను జరిగింది మనస్సులో పెట్టుకోమాకు, అతనికి రాజకీయంగా లిఫ్ట్‌ ఇమ్మని అడిగి పార్టీలో చేరిన సంవత్సరంలోనే నెహ్రూ మరణించారు`` అని వెల్ల‌డించారు.


నెహ్రూ విన‌తి మేర‌కు చంద్ర‌బాబు నమ్మకంగా చేర్చుకుని ఆయన పోయిన తర్వాత తెలుగుయువత అధ్యక్షపదవి ఇచ్చాడని కొడాలి నాని మండిప‌డ్డారు. గుడివాడలో టిక్కెట్టు ఇచ్చి, దొంగ సర్వే కాగితాలు ఇచ్చి గుడివాడ పంపారు. ఓడిపోయివచ్చాక అతనిని ఓ పురుగులా చూశారు. పైన ఉన్న ఎన్టీఆర్, దేవినేని నెహ్రూ జ్ఞానోదయం కల్పిస్తే మా పార్టీలోకి వచ్చాడు. వాళ్లు ఏరకంగా బ్లాక్‌ మెయిల్‌ చేశారు.ఎంత ఇబ్బంది పెట్టారో అవినాష్‌ చెప్పాడు. ఇవ‌న్నీ వాస్త‌వాలైతే...అవినాష్‌ ఇంటికి వెళ్లి జగన్ త‌న‌పార్టీలోకి తీసుకువచ్చాడా? `` అని నిల‌దీశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: