తెలంగాణ రాష్ట్రంలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ భారీ షాక్ ఇచ్చారు. సమ్మె చేస్తున్న కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై వెనక్కు తగ్గినప్పటికీ ప్రభుత్వం మాత్రం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి చేర్చుకునే ఆలోచన లేదని తేల్చి చెబుతోంది. ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ సునీల్ శర్మ ప్రభుత్వం తరపున దాఖలు చేసిన అఫిడవిట్ లో ఆర్టీసీ కార్మికులు కోరుతున్న డిమాండ్లను పరిష్కరించడం సాధ్యం కాదని తెలిపారు. 
 
ఫైనల్ అఫిడవిట్ ను సునీల్ శర్మ కోర్టుకు ఇప్పటికే సమర్పించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని ప్రభుత్వం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో ఎట్టి పరిస్థితులలోను చర్చలు జరిపే ప్రసక్తి లేదని సునీల్ శర్మ కోర్టుకు తేల్చి చెప్పారు. ఆర్టీసీ సంస్థకు సమ్మె చేస్తున్న కార్మికుల వలన 44 శాతం నష్టాలు వచ్చినట్లు సునీల్ శర్మ హైకోర్టుకు చెప్పారు. సునీల్ శర్మ దాఖలు చేసిన అఫిడవిట్ తో ప్రభుత్వ వైఖరి మరోసారి స్పష్టమైంది. 
 
సునీల్ శర్మ దాఖలు చేసిన అఫిడవిట్ లో కొందరు యూనియన్ నేతలు తమ ఉనికి కోసం సమ్మె చేస్తున్నారని తమ స్వార్థం కోసం ఆర్టీసీని నష్టాల్లోకి నెడుతున్నారని పేర్కొన్నారు. కోర్టు ఆర్టీసీ కార్మికుల సమ్మెను చట్ట వ్యతిరేకమైనదిగా ఆదేశించాలని సునీల్ శర్మ కోరారు. కార్మిక సంఘాల ప్రవర్తనతోనే ఆర్టీసీ కార్పొరేషన్ కు ఈ పరిస్థితి వచ్చిందని సామాన్య ప్రజలు ఇబ్బందులు పడతారని తెలిసినా కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్లాయని సునీల్ శర్మ పేర్కొన్నారు. 
 
ఆర్టీసీ కార్మికులు ప్రతి చిన్న విషయానికి సమ్మె బాట పడుతున్నారని సునీల్ శర్మ కోర్టుకు చెప్పారు. ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రతిపక్షాలతో చేతులు కలిపి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని సునీల్ శర్మ తెలిపారు. కార్మికులు విధుల్లో చేరతామని చెప్పినా తీసుకునే పరిస్థితుల్లో ఆర్టీసీ లేదని సునీల్ శర్మ కోర్టుకు తెలిపారు. సునీల్ శర్మ కోర్టుకు ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రసక్తి లేదని చెప్పటంతో సీఎం కేసీఆర్ కార్మికులకు ఊహించని షాక్ ఇచ్చాడని చెప్పవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: