వైకాపా అధికారంలోకి అచ్చిన ఐదు నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది.  ఒకవైపు సంక్షేమ పధకాలను ప్రవేశపెడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ.. ప్రభుత్వం దూసుకుపోతున్నది.  అయితే, ప్రభుత్వం ఏర్పాటు జరిగి ఐదు నెలలు అవుతున్నా రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.  


గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రైజింగ్ సిటీ పేరుతో అమరావతిని రాజధానిగా ప్రకటించి ఆర్భాటంగా ఆరంభం చేసుకుంది.  ఈ వేడుకకు పొరుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాని మోడీ హాజరయ్యారు.  అంగరంగ వైభవంగా అమరావతి ప్రారంభోత్సవం జరుపుకుంది.  అయితే, రాజధాని ఏర్పాటుకు అప్పటి ప్రతిపక్షం వైకాపాను కూడా ప్రభుత్వం ఆహ్వానించింది.  కానీ, ప్రతిపక్షం ఈ వేడుకకు దూరంగా ఉన్నారు.  ఏదైతేనేం అమరావతి ప్రారంభోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. 


అమరావతిలో కొన్ని తాత్కాలిక నిర్మాణాలు కూడా ఏర్పాటు జరిగాయి.  అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టులు ఏర్పాటు అయ్యాయి.  విషయం ఏమిటంటే.. ఈ తాత్కాలిక నిర్మాణాలు తప్పించి శాశ్వత నిర్మాణాల వ్యవస్థాపన జరగలేదు.  పైగా 2018 నాటికి మొదటిదశ నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ విషయంలో ఫెయిల్ అయ్యింది.  ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో ఫెయిల్ అయ్యిందో అప్పటి నుంచే ఆ పార్టీకి వ్యతిరేకత మొదలైంది.  


2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా సంగతి తెలిసిందే.  కానీ, ఇప్పుడు వైకాపా ప్రభుత్వం అమరావతి గురించి పట్టించుకోవడం లేదు.  అమరావతిని పక్కన పెట్టింది. ఆంధ్రుల రాజధాని అమరావతిని ప్రభుత్వం పక్కన పెట్టిందని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ లో లేవనెత్తబోతున్నది.  సాక్షాత్తు ప్రధాని మోడీ చేస్తుల మీదుగా ప్రారంభం చేసుకున్న అమరావతి నిర్మాణం ఆగిపోవడం సరికాదని, రాజధాని విషయంలో వైకాపా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదని పార్లమెంట్ లో వాదించబోతున్నది తెలుగుదేశం.  


మరింత సమాచారం తెలుసుకోండి: