బ్రిటన్‌ యువరాజు, ప్రిన్స్‌ ఆండ్రూ త‌ను చేసిన అవ‌మాన‌క‌ర‌మైన ప‌నిపై తొలిసారిగా స్పందించాడు. మైనర్లను వ్యభిచార రొంపిలోకి దింపడంతోపాటు వారిపై లైంగిక దాడికి పాల్పడిన కేసుల్లో దోషి, అమెరికాకు చెందిన ఫైనాన్షియర్‌ జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో స్నేహంపై మొదటిసారి బహిరంగంగా స్పందించాడు. . బీబీసీ న్యూస్‌నైట్‌ ప్రోగ్రామ్‌ కోసం ఎమిలీ మైట్లీస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎప్‌స్టీన్‌ జైలు నుంచి విడుదలైన తర్వాత తాను అతడిని కలువడం ద్వారా రాచ కుటుంబ స్థాయిని తగ్గించానని అంగీకరించారు.ఇందుకు తనను తాను ప్రతిరోజూ కొట్టుకున్నట్లు చెప్పారు. 


అమెరికాకు చెందిన మిలియనీర్, పెట్టుబడిదారుడైన జెఫ్రీఎప్‌స్టీన్ మైనర్ అమ్మాయిలను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో న్యూయార్క్ సమీపంలో మన్‌హట్టన్ జైలులో గత జూలై నుంచి ఉంటున్నాడు. అయితే,తీర్పు వెలువ‌డ‌టానికి కొన్నిరోజుల ముందే ఆయన జైలులో బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే, అతడు ఉరివేసుకోవడానికి రెండ్రోజుల ముందు వీలునామా రాశాడు. ఆగస్టు ఎనిమిదో తేదీన దాదాపు 577 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.4000 కోట్ల ఆస్తిని ఓ ట్రస్టుకు రాసి ఇచ్చాడు.


కాగా,  బ్రిటన్‌ యువరాజు, ప్రిన్స్‌ ఆండ్రూ ఫైనాన్షియర్‌ జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో స్నేహం చేశారు. ఎప్‌స్టీన్ ఈ ఆరోప‌ణ‌ల‌పై ఓ సారి జైలు నుంచి విడుదలైన తర్వాత తాను అతడిని కలుసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీనిపై తాజాగా స్పందిస్తూ, ఎప్‌స్టీన్‌ దోషిగా నిర్ధారణ అయిన తర్వాత కూడా అతడితో స్నేహం కొనసాగించడంపై ప్రిన్స్‌ ఆండ్రూ విచారం వ్యక్తంచేశారు. ఎప్‌స్టీన్‌ బాధితుల్లో ఒకరైన వర్జీనియా గిఫ్రే ...రాకుమారుడు ప్రిన్స్‌ ఆండ్రూతో సెక్స్‌లో పాల్గొనాలని ఎప్‌స్టీన్‌ తనను బలవంతపెట్టాడని గతంలో ఆరోపణలు చేశారు. గిఫ్రేతో శారీరక సంబంధంపై బీబీసీ విలేకరి ప్రశ్నించగా.. ఆమెను ఎన్నడూ కలిసినట్లు తనకు గుర్తు లేదని ఆండ్రూ సమాధానమిచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: