ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు చంద్రబాబు కేంద్రాన్ని ఢీ కొట్టడం మంచిదే అని అభిప్రాయపడిన టీడీపీ శ్రేణులు ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమిని చూసి ఒక్కసారిగా మాట మార్చారు. చంద్రబాబు అనవసరంగా కేంద్రానికి ఎదురు వెళ్లారు అందుకే ఓడిపోయారు, జగన్ కేంద్రంతో సావాసం చేశాడు అందుకే గెలిచాడు అని... దీనికి తోడు బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ చేసే విమర్శలకు జగన్ గాని ఆయన  మంత్రి వర్గంగానీ స్పందించకపోవడంతో టీడీపీ శ్రేణులకు అది నిజమే అనే అభిప్రాయం బలపడింది. 


అది పక్కన పెడితే మా మద్దతు వలనే జగన్ గెలిచాడు అంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడటం, ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు ఎందుకు కేంద్రానికి దూరంగా జరిగారు అనే అభిప్రాయం ఆ పార్టీ కార్యకర్తల్లో ఎక్కువగా వినపడింది. సోషల్ మీడియా కామెంట్లు కూడా ఇదే విధంగా పెడుతూ చంద్రబాబుని విమర్శించారు,. మరి చంద్రబాబుకి కూడా ఆ విషయం జ్ఞానోదయం అయిందో ఏమో గాని ఇప్పుడు కేంద్రంతో స్నేహం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 


ఒకరకంగా ఎన్నికల తర్వాత చంద్రబాబుని కేంద్రం పెద్దగా ఇబ్బంది పెట్టిన దాఖలాలు ఏమీ లేవనే చెప్పాలి. దీనితో చంద్రబాబు తనకు ఉన్న పాత మిత్రుల సాయంతో కేంద్రానికి దగ్గర కావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. వచ్చే నెల చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. ఆయన ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా తో భేటీకి ప్రయత్నాలు చేశారనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. 


కొన్ని పరిణామాలు చూస్తుంటే అది నిజమే అనే అనుమానం కలుగుతుంది. ఇసుక విషయంలో చంద్రబాబు దూకుడుగానే వెళ్తున్నారు. ఇందుకోసం కార్మికులకు మద్దతుగా ఆయన ఒక రోజు దీక్ష కూడా చేశారు కాబట్టి... ఇవన్నీ కేంద్రానికి వివరించాలని, శాంతి భద్రతలు సరిగా లేవని, రాజకీయ కక్షలతో నాశనం చేస్తున్నారని, కేంద్రానికి చెప్పేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇక కార్పొరేట్ సంస్థలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినా పరిణామాన్ని కూడా వివరించి జగన్ మీద వ్యతిరేకత తీసుకురావాలని ఆయన భావిస్తున్నారట. వ‌రుస ప్లాన్ల‌తో ప్లాప్ అవుతోన్న బాబు ఇప్పుడు మ‌రో స‌రికొత్త కుట్ర‌కు తెర‌దీస్తున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: