ఆర్టీసీ సమ్మెపై  హైకోర్టుకు యాజమాన్యం దాఖలు చేసిన ఫైనల్ అఫిడవిట్ పై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఆర్టీసీ సమ్మె వెనుక భారీ కుట్ర ఉందన్న ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ, ప్రతిపక్షాలతో కలిసి  ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కార్మికులు సమ్మెకు వెళ్లారని  ఆరోపించడం పై కార్మిక సంఘాల జేఏసీ నేతలు మండిపడుతున్నారు . ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధం చేసిన అఫిడవిట్ పై సునీల్ శర్మ సంతకం పెట్టినట్లు ఉంది కానీ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల ఆయనకు చిత్తశుద్ధి ఉన్నట్లు ఏమాత్రం కన్పించడం లేదని అంటున్నారు .


ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ గా బాధ్యతలు చేపట్టిన 17 నెలల వ్యవధిలో కనీసం ఏడుసార్లు కూడా ఆఫీస్ కు రాని సునీల్ శర్మ కు అసలు ఆర్టీసీ గురించి ఏమి తెలుసునని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రశ్నించారు . ఆర్టీసీ కార్మికులు గత 42 రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర  ప్రభుత్వం  ఏమాత్రం ఖాతరు చేయడం లేదు . కార్మిక సంఘాల నేతలను  చర్చలకు పిల్చి సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోగా , ఇప్పుడు కార్మికులు విధుల్లో చేరుతామన్న యాజమాన్యం  ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొందని ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ పేర్కొనడం పరిశీలిస్తే , ఇక ఆర్టీసీ ని ప్రయివేటుపరం  చేయడమే తరువాయి అన్నట్లుగా సునీల్ శర్మ వ్యాఖ్యలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు .


రాష్ట్రం లోని 5100 బస్సు రూట్లను ప్రయివేట్ పరం చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపధ్యం లో, సునీల్ శర్మ వ్యాఖ్యలు, కేసీఆర్ వ్యాఖ్యలకు  మరింత బలాన్ని చేకూర్చే విధంగా  ఉన్నాయని పేర్కొంటున్నారు . రాష్ట్ర ప్రభుత్వం 50 వేలకు పైచిలుకు ఉన్న ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు తో ఆడుకుంటుందని విమర్శిస్తున్నారు  

మరింత సమాచారం తెలుసుకోండి: