చంద్రయాన్ 2.. ఎన్నో కోట్లమంది కల నిజమయ్యే చివరి క్షణాల్లో చంద్రయాన్ విఫలం అయ్యింది. ఎంతో ప్రేమతో ఒక కొత్త చరిత్రను సృష్టించాలనుకున్న వారి కల అతి సమీపంలో ఉందన్నంగా, చంద్రుడికి అత్యంత సమీపంలోకి వెళ్లిన విక్రమ్‌ ల్యాండర్‌ చివరి నిమిషంలో విఫలం అయ్యింది.. అయితే ఆలా కావడానికి గల కారణాల అన్వేషణలో ఇస్రో పురోగతి సాధించినట్లు సమాచారం.


సాఫ్టవేర్‌ సమస్యతోనే విక్రమ్‌ ల్యాండింగ్‌ విఫలమైందని అంతర్గత నివేదికను స్పేస్‌ కమిషన్‌కు నేడు అందజేసింది. చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అయ్యేలా చంద్రయాన్‌-2ను రూపకల్పన చేశారు. అయితే అక్కడ చంద్రుడి ఉపరితలానికి దాదాపు 500 మీటర్ల సమీపం వరకు వెళ్లి కూలిపోయింది. చివరి నిమిషంలో ఆలా అవుతుంది అని శాస్త్రవేత్తలు ఎంతమాత్రం అంచనా వేయలేకపోయారు. 


అయితే విక్రమ్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌ను పరీక్షించిన సమయంలో అందులో ఎటువంటి సమస్య తలెత్తలేదు. నిజానికి విక్రమ్‌ ల్యాండర్‌ ఆర్బిటర్‌ నుంచి విడిపోయి దాదాపు 30 కి.లో మీటర్లు సురక్షింతంగా ప్రయాణించింది. కానీ రఫ్‌ బ్రేకింగ్‌ దశ నుంచి ఫైన్‌ బ్రేకింగ్‌ దశకు వచ్చినప్పుడు విక్రమ్ ల్యాండరింగ్ లో సమస్య మొదలైంది. 


ఇందుకు అమర్చిన థ్రస్ట్‌ల్లో ఒక దానిని మండించి సెకన్‌కు 146 మీటర్లు ప్రయణించేలా నియంత్రించే క్రమంలో అదుపు తప్పి సెకన్‌కు 750 మీటర్ల వేగంతో చంద్రుడిని 'ఢీ'కొట్టింది. దీంతో ఫలితంగా విక్రమ్‌ ల్యాండర్‌, రోవర్‌ దెబ్బతిన్నాయి. ఈ వైఫల్యంపై లిక్విడ్‌ ప్రొపెల్షన్‌ సిస్టమ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ వి.నారాయణ నేతృత్వంలోని అంతర్గత కమిటీ పరిశీలన చేసింది. 


ఈ కమిటీకి నాసా నుంచి కొంత సమాచారం వచ్చింది. వీటిపై చేసిన అధ్యయనం సాయంతో వచ్చే ఏడాది నవంబర్‌లో జరగబోయే చంద్రయాన్‌-3కి సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది ఈ సమయానికి చంద్రయాన్ 3 విజయవంతం అయి మన భారతీయుల కల నెరవేరాలని ఆశిద్దాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: