కొత్త ఏడాదికి సరిగ్గా యాభై రోజులు కూడా లేదు కానీ ఏపీ రాజకీయాల్లో మాత్రం వేడి గట్టిగా రాజుకుంటోంది. బంపర్ మెజారిటీతో వచ్చిన జగన్ మంచి దూకుడు మీద  ఉన్నారు. వరసగా ఒకటి తరువాత ఒకటి సంక్షేమ పధకాలను ప్రారంభించిన జగన్ రాజకీయాల మీద ఇపుడిపుడే ద్రుష్టి పెడుతున్నారు. ఆయన పూర్తి స్థాయిలో తన ఫొకస్ మొత్తం కొత్త ఏడాదిలో పెడతారట. అంటే కొత్త ఏడాదిత్లో రాజకీయాలు యమ రంజుగా ఉంటాయని వేరే చెప్పాలా.


ఇదిలా ఉండగా జగన్ ఒక పధ్ధతి ప్రకారం ముందుకు సాగుతున్నారని అంటున్నారు. ఆయన ప్రజల అవసరాలను తీరుస్తూంటే  మరో వైపు అవినీతి రహిత పాలన కోసం తీవ్ర స్థాయి నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు. ఇప్పటికే ఏసీబీ అధికారులను రంగంలో దించిన జగన్ అవినీతి మూలాలను ఏరేసేందుకు అన్ని రకాల చర్యలకు దిగిపోతారని అంటున్నారు.
చెవిలో జోరిగల్లా ఉన్న విపక్షాలకు సైతం గట్టి హెచ్చరికలు పంపిస్తూ అవినీతి ఎవరు చేసినా ఉపేక్షించమన్న సందేశాన్ని జగన్ పంపిస్తారని అంటున్నారు. పాలన అంటే జగన్ ది అని జాతీయ స్థాయిలో మారుమోగేలా  ఉండాలన్నది జగన్ నిర్ణయంగా చెప్పుకుంటున్నారు. ఇక అవినీతికి ఉక్కుపాదంతో అణచివేసే రాష్ట్రంలా ఏపీని తీర్చిదిద్దాలన్నది జగన్ పట్టుదలగా చెబుతున్నారు.


అదే సమయంలో స్పందన కార్యక్రమాన్ని మరింత ఎఫెక్టివ్ గా నడిపిస్తూ ప్రజల సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించాలను జగన్ భావిస్తున్నారని అంటున్నారు. మరో వైపు కేంద్రంలోని బీజేపీ సర్కార్ సైతం తన వైపు కన్నెత్తి చూసే ధైర్యం లేనంత‌ దూకుడుతో జగన్ పాలిస్తారని, దానికి సంబంధిచిన కార్యక్రమాలను టోటల్ గా  ఆయన రెడీ చేసి పెట్టుకున్నారని అంటున్నారు. మొత్తానికి అటు ప్రతిపక్షాలను హడలెత్తించేలా, మరో వైపు ప్రజలు మెచ్చుకునేలా జగన్ పాలన సాగుతుందని, ఎన్నో సంచలనాలకు తెర తీసేలా పాలన ఉంటుందని అంటున్నారు. మరొ కొత్త ఏడాదిలో కొత్త జగన్ని చూస్తావేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: