గతంలో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోడీ 'పోలవరం ప్రోజెక్ట్' - నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ‘ఏటీఎం’ గా మారిందని అన్నారు. అంతే కాదు, ఇక్కడ ఏపిలో రాజకీయంగా 'కుమారుడు సూర్యునిలా అస్తమిస్తేనే, అభివృద్ధి అనే సూర్యోదయం అవుతుంది' అంటూ ప్రధాని నరేంద్ర మోడీ నాడు  చంద్రబాబుపై విరుచుకు పడటమేకాదు కేంద్ర పథకాలకు స్టిక్కర్లు వేసి అమలు పరచటంతో ‘స్టిక్కర్ బాబు’ అని అభివర్ణించారు. గతంలో చంద్రబాబును “యూటర్న్ బాబు” గా అభివర్ణించిన నరేంద్ర మోదీ- మాటలతో ఆ పేర్లు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి.


అయితే ఇప్పుడు వైసిపీ ఎంపీ విజయసాయి రెడ్డి - టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌‌ - టిడిపి జాతీయ కార్యదర్శి లోకేష్ - ను మరోసారి టార్గెట్ చేశారు వైసిపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాజధాని అమరావతి, ఇసుక ఇంగ్లిష్ మీడియం అంశాలను పేర్కొంటూ విమర్శలు గుప్పించారు. వల్లభనేని వంశీ మోహన్ వ్యవహారంపైనా స్పందించారు. 'మాలోకం' మాటలు ఎవరూ పట్టించుకోలేదంటూ నారా లోకేష్‌ పై దుమ్ములేపే సెటైర్లు పేల్చారు. వరుస ట్వీట్‌లతో విరుచుకు పడ్డారు.


టీడీపీకి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారంపై విజయసాయి ఘాటుగా స్పందించారు. వంశీ వదిలిన సవాళ్లకు తెదేపా జవాబిచ్చే పరిస్థితిలో ఉందా? అంటూ ఎద్దేవా చేశారు. మాలోకం ఏదో అన్నాడు కానీ ఎవరూ పట్టించుకోలేదంటూ మాజీ మంత్రి నారా లోకేష్‌ను టార్గెట్ చేశారు. టీడీపీ మునిగిపోయే పార్టీ అని అందరికీ అర్థమైంద న్నారు. చివరకు తండ్రీ కొడుకు, తోక పార్టీ దత్తపుత్రుడు మాత్రమే మిగులుతారని, ఎల్లో మీడియా కూడా షాక్ నుంచి తేరుకోనట్టుందంటూ వ్యంగ్యాస్త్రా లు సంధించారు.


ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని పవన్‌ కళ్యాణ్ వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఎంపీ విజయసాయి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘భగత్ సింగ్ ఆత్మహత్య చేసు కున్నాడని, జాతీయ జెండా రూపకర్త నెహ్రూ అని, స్వాతంత్య్రం 194 0లో వచ్చిందని చెప్పి అమ్జాన్ని బయట పెట్టుకున్న 'నిత్యకళ్యాణం' ఢిల్లీ వెళ్లి ఏ భాషలో మాట్లాడు తున్నాడో!’ అంటూ సెటైర్లు వేశారు. హిందీ, ఇంగ్లిష్ రాకుంటే అక్కడ హోటల్‌ లో భోజనం కూడా ఆర్డర్ ఇచ్చుకోలేమని ఎద్దేవా చేశారు.


ఏపీ రాజధాని అమరావతి 'బంగారు బాతు' అని, దానిని చంపేశారని చంద్రబాబు ఎందుకు ఏడుపులు లంఖిచ్చుకున్నారో? ఇప్పుడిప్పుడే అర్థమైందంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతి పేరుతో చంద్రబాబు కమీషన్లకు తెరతీశారని, ఆ భాగోతం ఇప్పుడిప్పుడే బయటపడుతోందని విమర్శించారు. ఆదాయపన్ను శాఖ బాబు  బొంకులను బయటపెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. అమరావతిలో తాత్కాలిక భవనాల కాంట్రాక్టు పొందిన సంస్థ ₹500 కోట్లు ముట్ట చెప్పిందని 'సిబిడీటి - సెంట్రల్ బోర్డ్ డైరెక్ట్ టాక్సెస్' బయట పెట్టిన తర్వాత లింకులు, బొంకులన్నీ ఒక్కటొకటిగా వెలుగు చూస్తున్నాయని వ్యాఖ్యానించారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: