ఏపీలో ప్రభుత్వం మారి దాదాపు ఆరు నెలలు కావొస్తుంది. ఈ ఆరు నెలల్లో కొత్తగా వచ్చిన జగన్ ప్రభుత్వం...సరికొత్త పాలన అందిస్తూ ముందుకెళుతుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ తన మేనిఫెస్టోలోని ఒక్కో హామీని అమలు పరుచుకుంటూ వెళుతున్నారు. ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు, పథకాలు అమలు చేస్తున్నారు. అయితే ఎక్కువ శాతం ప్రజలు జగన్ పాలన పట్ల సంతృప్తిగానే ఉన్నా... కొందరులో మాత్రం వ్యతిరేకిత కనిపిస్తోంది. ముఖ్యంగా ఇసుక, అభివృద్ధి కార్యక్రమాల్లో విషయాల్లో జగన్ పాలన పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


అయితే రానున్న రోజుల్లో ఆ సమస్యలకు కూడా జగన్ పెట్టడం ఖాయం. కాకపోతే వీటినే పట్టుకుని ప్రతిపక్షాలు రాజకీయం చేసుకుంటున్నాయి. అయితే ఈ వ్యతిరేకితని కూడా క్యాష్ చేసుకోలేని స్థితిలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఉంది. జగన్ పై వ్యతిరేకిత ఉన్నా ప్రజలు టీడీపీ పై పాజిటివ్ గా లేరు. పైగా ఆ పార్టీని సొంత నేతలే నమ్మట్లేదు. వరుసగా చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చేసి వెళ్లిపోతున్నారు. దానికి కారణం కూడా బాబే. ఆయన పార్టీని వదిలేసి కుమారుడు లోకేశ్ ఎదుగదలపై దృష్టిపెట్టడం వల్ల టీడీపీకు ఇంకా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.


ఈ క్రమంలోనే వైసీపీపై వ్యతిరేకితని జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాగే ఉపయోగించుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో వారికి ఒక సీటే వచ్చినా....తర్వాత నిదానంగా పుంజుకున్నట్లు కనబడుతుంది. దానికి ఉదాహరణే ఇసుక సమస్యంపై లాంగ్ మార్చ్ కు పిలుపునిస్తే వేలాదిమంది రోడ్లు మీదకొచ్చారు. ఇక బాబు 12 గంటలు నిరాహార దీక్ష చేసిన వందలమంది కూడా రాలేదు. దీని బట్టి చూస్తే ప్రజలు కూడా ప్రతిపక్ష నాయకుడు అంటే పవన్ కల్యాణ్ అనే విధంగానే నడుచుకుంటున్నారు. మొత్తానికైతే బాబు ప్రతిపక్షంలో కూడా వెనక్కి వెళ్ళిపోయారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: