ఈ తీర్పు అత్యాచారాలను ప్రోత్సహిస్తున్నట్టు ఉంది. పసికందును కిరాతకంగా అత్యాచారం చేస్తే.. ఓ కోర్టు అతడికి మరణ శిక్ష విధించింది. కానీ హై కోర్టు అతనికి చచ్చేదాకా జైలు శిక్ష అంటూ విధించింది. ఇంకా వివరాల్లోకి వెళ్తే... వేసవి కాలంలో వేడి ఎక్కువ ఉందని తొమ్మిది నెలల పసిపాపతో తల్లి నిద్రిస్తుంటే.. ఆ 9 నెల పాపను అత్యాచారం చేశాడు ప్రవీణ్ అనే కామాంధుడు.        


ఆ కామాంధుడికి కేవలం 51 రోజుల్లో విచారణ పూర్తి చేసి వరంగల్ కోర్టు ఉరిశిక్ష విధించింది. అత్యంత తొందరగా ఒక కేసులో కోర్టు నిర్ణయం తీసుకుంది ఈ కేసు చరిత్రలో నిలిచి పోతుంది అని అనుకున్నారు ప్రజలంతా. కానీ అంతలేదు.. అని ఆ నిందితుడు హైకోర్టుకు తీసుకెళ్లాడు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు నిందితుడు ప్రవీణ్‌కు ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మర్చి మహా అద్భుతమైన తీర్పు ఇచ్చింది.     


నిందితుడు అయినా ప్రవీణ్ చనిపోయే వరకు జైల్లోనే ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ తీర్పు విన్న తెలుగు రాష్ట్రాల ప్రజలు సోషల్ మీడియా వేధికగా ఈ తీర్పును ప్రశ్నిస్తున్నారు. ఏంటి ఈ తీర్పు.. అతడు ప్రజల కోసం కష్టపడి జైలుకు వెళ్ళలేదు.. జీవితాంతం అతన్ని మేపడానికి.. అతనికి ఉరిశిక్ష విధించండి అంటూ నెటిజన్లు హైకోర్టు తిపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.     


మరి కొందరు.. ఇదేం తీర్పు అండి బాబు.. అత్యాచారాలను ప్రోత్సహిస్తున్నట్టు ఉంది. ఇప్పటికే కొన్ని మృగాలు తాగి పసికందుల నుండి వృద్ధుల వరుకు అందరిని అత్యాచారాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ తీర్పు వల్ల ఎవడికి భయం ఉండదు.. అని కామెంట్లు పెడుతున్నారు. మరి మీరు ఈ తీర్పుకు మద్దతు ఇస్తారా ? 



మరింత సమాచారం తెలుసుకోండి: