ఏపీలో టీడీపీకి గడ్డుకాలం నడుస్తుంది. ఓటమి ఆ పార్టీని ఓ రకంగా చావుదెబ్బ కొడితే. నేతల పార్టీ మార్పులు మరింత కష్టాల్లోకి నెట్టేస్తుంది. ఓ వైసీపీ అధికార వైసీపీ, మరో వైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ తో ఆ పార్టీ ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. అసలు టోటల్ గా ఏపీలో టీడీపీ పరిస్తితి ముందు నెయ్యి...వెనుక గొయ్యి లాగా అయిపోయింది. ఇక మొన్నటివరకు మాజీ నేతలు, సీనియర్, జూనియర్ నేతలు పార్టీ మారితే...తాజాగా ఎమ్మెల్యేలు కూడా హ్యాండ్ ఇవ్వడం మొదలుపెట్టారు.


ఇప్పటికే వల్లభనేని వంశీ టీడీపీకి షాక్ ఇవ్వడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 22కు పడింది. అయితే ఈ సంఖ్య మరింత పడిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. వంశీతో కలుపుకుని దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోతారని ప్రచారం జరుగుతుంది. అందులో నలుగురు బీజేపీలోకి, నలుగురు వైసీపీలోకి వెళ్లతారనే టాక్ నడుస్తుంది. ఇందులో గంటా శ్రీనివాసరావు బ్యాచ్ ముందుంది. విశాఖలో గంటా శ్రీనివాసరావుతో కలిపి మరొక ఎమ్మెల్యే బీజేపీలోకి వెళ్లతారని తెలుస్తోంది.


అలాగే గుంటూరులో ఒకరు, ప్రకాశంలో మరొకరు బీజేపీలోకి వెళ్ళే అవకాశముందని ప్రచారం జరుగుతుంది. ఇటు వైసీపీలోకి కూడా నలుగురు ఎమ్మెల్యేలు జంప్ అవుతారని అంటున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ అధిష్టానంతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి 8 మంది ఎమ్మెల్యేలు మాత్రం టీడీపీని వీడటం ఖాయమని సమాచారం. ఇక 8 మంది పార్టీని వీడితే టీడీపీకి ప్రతిపక్ష హోదా గల్లంతు ఖాయం కావడం పక్కా. 23 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది వెళితే టీడీపీకి 15 మంది ఉంటారు. 17 కిందికి వెళితే ప్రతిపక్ష హోదా పోయినట్లే. మరి చూడాలి ఏ ఎమ్మెల్యే ఎప్పుడు టీడీపీకి హ్యాండ్ ఇస్తారో?


మరింత సమాచారం తెలుసుకోండి: