ఎన్నో ఏళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీకు చివరి రోజులు వచ్చేసినట్లు కనిపిస్తున్నాయి. 37 ఏళ్ల చరిత్ర గల ఆ పార్టీ తెలంగాణలో దాదాపు కనుమరుగైపోతే....ఆంధ్రప్రదేశ్ లో కొన ఊపిరితో కొట్టమిట్టాడుతోంది. అయితే మొన్నటివరకు పార్టీని ఒంటిచేత్తో నడిపిన అపర చాణక్యుడు చంద్రబాబు సత్తా అయిపోయినట్లు కనిపిస్తోంది. అందుకే ఆ పార్టీని నేతలు వరుసగా వీడుతున్నారు. పైగా బాబు...తన కుమారుడు లోకేశ్ ని అందలం ఎక్కించాలని చూడటం ఆ పార్టీకి మరింత నష్టం తెచ్చిపెడుతుంది.


ఈ క్రమంలో బాబు అనేక తప్పులు చేస్తూ పార్టీని మరింత ముంచుతున్నారు. అసలు తెలంగాణలో టీడీపీ లేదనే విషయం చక్కగా కనబడుతుంది. ఇంత క్లియర్ గా తెలుస్తున్న బాబు మాత్రం తెలంగాణలో ఏదో సాధిద్ధామని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ ప్రయత్నాలు ఏవో ఏపీలో పెడితే కొంచెం పార్టీ బాగుపడే అవకాశముంది. అదేం లేకుండా బాబు తెలంగాణలో రాజకీయం నడుపుతున్నారు.


2018 అసెంబ్లీ ఎన్నికల్లోనే అక్కడ టీడీపీ పరిస్తితి ఏంటో తేలిపోయింది. అయినా సరే పార్టీని వదిలేయకుండా స్థానిక సంస్థలు, పంచాయితీ ఎన్నికలు, మొన్న జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్ధులని నిలిపి చేతులు కాల్చుకున్నారు. ఇంత జరిగిన ఏమన్నా వదిలేస్తున్నారా అంటే అది లేదు. వారం వారం హైదరాబాద్ వెళుతున్న బాబు అక్కడి నేతలతో సమావేశమై పార్టీని బలోపేతం చేయాలని చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్లమెంటరీ కమిటీలని కూడా నియమించారు. 


అసలు బలమే లేదనుకుంటే కమిటీలు నియమించి ఏం చేద్దామనుకుంటున్నారో అర్ధం కాకుండా ఉంది. దీనిని బ‌ట్టి బాబు ఎంత కామెడీ పాలిటిక్స్ చేస్తున్నారో తెలుస్తోంది. ఓ వైపు ఏపీలో టీడీపీ చావుదెబ్బ తిని ఉంది. అక్కడ నేతలు వేరే పార్టీల్లోకి జంప్ అయిపోతున్నారు. ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టి పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి. పార్టీ అడ్రెస్ లేని తెలంగాణలో పోరాడుతున్నారు. ఇలాంటి పనులు వల్ల బాబు టీడీపీని మరింత ముంచేలా కనిపిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: