ఏపీలో జగన్ పాలన విషయంలో దూకుడుగా ఉంటున్నారు. అనుభవం కలిగిన నాయకుని మాదిరిగానే ఆయన పాలన చేస్తున్నారు. పేద వర్గాలే లక్ష్యంగా అయన అనేక సంక్షేమ కార్యక్రమాలు  అమలు చేస్తున్నారు. అయితే జగన్ పాలనని విమర్శించడమే అన్ని పార్టీలు  టార్గెట్ గా పెట్టుకున్నాయి. సంబంధం లేని సమస్యలపైన అల్లరి చేస్తూ జనాల్లో పలుచన అవుతున్నాయి.


అయితే జగన్ విషయంలో వామపక్షాలు మాత్రం ఎప్పటికపుడు నిర్మాణాత్మక విమర్శలు చేస్తూ వస్తున్నాయి. ఈ విషయంలో సీపీఐ, సీపీఎం ధోరణిని మెచ్చుకోవాలి. చిల్లరగా పొలిటికల్ మైలేజ్ కోసం తపన పడకుండా ఆ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఈ మధ్యనే జగన్ సైతం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుని కలసి ఆయన ఆరోగ్యం విషయంలో పరామర్శించారు.


ఇవన్నీ ఇలా ఉంటే బీజేపీ, జనసేన, టీడీపీ జగన్ విషయంలో మతం కార్డుని ఉపయోగిస్తున్నాయి. జగన్ తిరుపతి వెళ్ళినపుడు డిక్లరేషన్ ఇవ్వలేదని గొడవ చేస్తున్నాయి. తెలుగు భాషను తీసేయడం  అంటే క్రిస్టియానిటీని ప్రోత్సహించడమేనని కూడా అంటున్నాయి. దీని మీద సీపీఎం నేత మధు మండిపడుతున్నారు. భాషకు మతంతో ముడి పెట్టడం దారుణమని ఆయన అంటున్నారు. ఇది నీచమైన రాజకీయం అని కూడా ఆయన చెబుతున్నారు.


మరో వైపు జగన్ ప్రత్యేక హోదా విషయంలో తన ఎంపీలకు   దిశానిర్దేశం చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ అభినందించారు. ఈ విషయంలో ప్రభుత్వం తన వంతు పాత్ర నిర్వహిస్తున్నా కూడా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంపై మరింత వత్తిడి తీసుకువస్తే బాగుంటుందని ఆయన సూచించారు. మొత్తానికి ఏపీలోని మూడు ప్రధాన పార్టీలు అడ్డగోలుగా జగన్ మీద పడి ఏడుస్తూంటే కామ్రెడ్స్ మాత్రం ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ  జగన్ విధానాలకు కొంతవరకు బాసటనా నిలవడం గొప్ప విషయం.  ఏది ఏమైనా రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: