ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా ఐదుగురి నిండు ప్రాణాలు బలికొన్న మదపుటేనుగు ‘బిన్‌లాడెన్’ మృతి చెందింది.  సాధారణంగా అడవీ ప్రాంతానికి చెందిన ఏనుగులు చుట్టు పక్కల గ్రామాల్లో పంటపొలాలపై దాడులు చేయడం చూస్తుంటాం. ముఖ్యంగా చెరుకు పంటపై ఇలాంటి దాడులు ఎక్కువగా కొనసాగుతుంటాయి.  ఈ క్రమంలో కొన్నిసార్లు ఏనుగులు మనుషులపై దాడులు చేయడం చూస్తుంటాం. ఈ మద్య అస్సాంలో అయిదుగురు ప్రాణాలను తీసిన మదపుటేనుగు జనాలను అత్యంత భయంకరంగా క్రూరంగా చంపేసిన ఏనుగుకు స్థానికులు బిన్‌లాడెన్‌ అంటూ పేరు పెట్టారు. 

పశ్చిమ అస్సోంలో గోల్‌పూరా జిల్లా రాంగ్‌జూలీ అటవీ ప్రాంతంలో అధికారులు ఈనెల 11న ఏనుగును గుర్తించి దాన్ని బంధించేందుకు ప్రయత్నించారు. మొత్తానికి అతి కష్టం మీద  ‘బిన్‌లాడెన్’కు మత్తుమందు ఇచ్చి బంధించారు.  అనంతరం దానిని జనసంచారం లేని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలని అధికారులు నిర్ణయించారు. కానీ ఆ ఎనుగు ప్రభావం చాలా ఉంటుందని భావించిన అధికారులు తర్వాత  నిర్ణయం మార్చుకుని ఓరంగ్ నేషనల్ పార్క్‌కు తరలించారు.  ఎనుగు సృష్టించిన బీభత్సానికి అక్కడ ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు..క్రూరమైన దాని అకృత్యాలు చూసి దానికి ఉగ్రవాది బిన్ లాడెన్ పేరును పెట్టారు.

ఆ తర్వాత అధికారులు ఈ ఏనుగుకు ‘కృష్ణ’ అని నామకరణం చేశారు. ఓరంగ్ పార్క్‌లో వదిలినప్పటి నుంచీ ఆరోగ్యంగానే ఉన్నట్టు కనిపించిన ‘కృష్ణ’ నిన్న తెల్లవారుజామున మృతి చెందింది. మత్తు ఎక్కువ ఇవ్వడం వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన బిన్‌ లాడెన్‌ మృతి చెందినట్లుగా స్థానికులు అనుకుంటున్నారు.  అయిదుగురు ప్రాణాలు తీసిన ఆ ఏనుగుపై ఏ ఒక్కరికి కనికరం లేదు.  విషయం తెలిసిన ప్రభుత్వం దాని మృతికి గల కారణాలను కనుగొనేందుకు అధికారులను నియమించింది.  తాజాగా బిన్ లాడేన్ ఎనుగు మృతి చెందడం వార్త వైరల్ గా మారింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: