ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు తాను ముఖ్యమంత్రి అయితే ప్రజలకు కచ్చితంగా నెరవేరుస్తానని ఇచ్చిన హామీల లో భాగంగా అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్యం తమ ప్రభుత్వం పంపిణీ చేస్తుంది అని చెప్పిన విషయం కూడా ఒకటి. తర్వాత అఖండ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగించిన తర్వాత కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు మధ్యాహ్న భోజనంలో భాగంగా సన్న బియ్యాన్ని మరియు రేషన్ షాపుల్లో కూడా అదే బియ్యాన్ని పంపిణీ చేస్తామని స్పష్టం కూడా చేశారు.

అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి అయిన కొడాలి నాని ఇప్పుడు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకుముందు ఇదే మంత్రిగారు శ్రీకాకుళం జిల్లాలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ సెప్టెంబరు 1వ తారీఖు నుండి రేషన్ షాపుల్లో సన్న బియ్యంని ఇస్తానని ప్రకటించాడు కూడా. దీనిని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టినట్లు వెల్లడించారు కూడా. అయితే ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా పత్రికా విలేకరులు మరియు మీడియా దీనిపై ప్రశ్నించగా కొడాలి నాని విపరీతమైన పదజాలంతో వారిపై ధ్వజమెత్తారు.

"సన్నాసి సన్నబియ్యం ఇస్తారంట అని అంటున్నారు... అసలు సన్న బియ్యం ఇస్తామని ఎవరు ఎవరికి చెప్పారు? నీ అమ్మ మొగుడు కి గాని చెప్పారా అంటూ తీవ్రమైన పదజాలంతో ఆయన అన్న మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయి. అంతకుముందు నాని తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారి పంపిణీ చేస్తున్న బియ్యం 15 నుంచి 20 రకాలుగా ఉంటుందని మరియు అందులో 25 శాతం నూకల ఉండేవి అని అన్న విషయం ఇప్పుడు ఆయనకు అంతా గుర్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: