చంద్రబాబునాయుడును కష్టాలు ఒకేసారి కమ్ముకుంటున్నట్లున్నాయి. ఒకవైపు నేతలు పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోతున్నారు. మరికొందరు నేతల ఆస్తులు బ్యాంకులు ఎటాచ్ చేసుకుంటు బహిరంగ నోటిసులిస్తున్నాయి. మరో నేతేమో వందల కోట్ల రూపాయలు అప్పులు చేసి దివాల పిటీషన్ వేశారు.

 

గన్నవరం  ఎంఎల్ఏ వల్లభనేని వంశీ పార్టీతో పాటు ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వంశీ రాజీనామా అంశం పార్టీని కుదిపేస్తోంది. అదే సమయంలో తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ పార్టీకి, పదవికి రాజీనామా చేసి వైసిపిలో చేరిపోయారు. అలాగే మరికొందరు ఎంఎల్ఏలు కూడా తొందరలోనే పార్టీకి రాజీనామాలు చేయబోతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.

 

ఇదే సమయంలో మాజీ మంత్రి, ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు అప్పుడెప్పుడో బ్యాంకులో 200 వందల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు.  తీసుకున్న అప్పు తీర్చలేదు. ఏదో మొక్కుబడిగా రూ. 35 కోట్ల విలువైన ఆస్తులను కుదవపెట్టారట. దాంతో అప్పు వసూలు చేసుకునేందుకు తనఖా పెట్టిన ఆస్తితో పాటు మొత్తం గంటా పేరుతో ఉన్న అన్నీ ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేయటానికి బ్యాంకు రెడీ అవుతోందని సమాచారం.

 

సరే వీళ్ళ విషయం ఇలావుండగానే చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడైన లింగమనేని రమేష్ కూడా సమస్యల్లో ఇరుక్కున్నారు. ఈయన కూడా వివిధ బ్యాంకులు సంస్ధల నుండి వందల కోట్లు అప్పులు తీసుకున్నారు. రియల్ ఎస్టేట్, పవర్ ప్రాజెక్టులు, విమానయాన సంస్ధలన్నీ నష్టాలో కూరుకుపోయాయట. అందుకనే తీసుకున్న అప్పులను తీర్చే పరిస్ధితి లేకపోవటంతో దివాలా పిటీషన్ వేశారు.

 

వందల కోట్ల రూపాయలను అప్పులు తీసుకుని ఎగ్గొట్టి  బ్యాంకులను మోసం చేసిన నేతలు టిడిపిలో చాలామందే ఉన్నారు.  టిడిపిలో నుండి బిజెపిలోకి ఫిరాయించిన రాజ్యసభ ఎంపిలు సుజనా చౌదరి, గరికపాటి మోహన్ రావు, టిజి వెంకటేష్ పైన కూడా ఇలాంటి ఆరోపణలే ఉన్నాయ.

 

ఇక ఎంఎల్సీ వాకాటి నారాయణరెడ్డి కూడా ఇదే ఆరోపణలపై సిబిఐ అరెస్టు చేసి జైల్లో పెట్టారు. బెయిల్ పై బయటున్నారు లేండి. మాజీ ఎంఎల్ఏ రామారావు మహారాష్ట్రలో కాంట్రాక్టులు చేసి బ్యాంకులను మోసం చేసిన కేసులో అరెస్టయ్యారు. ఇంకెంతమంది నేతలు ఇటువంటి కేసుల్లో అరెస్టవుతారో చూడాలి.

  


మరింత సమాచారం తెలుసుకోండి: