పార్ల‌మెంటు సమావేశాల సంద‌ర్భంగా ప్రాంతీయ పార్టీల‌ను ఐస్ చేసే ప్ర‌య‌త్నం చేశారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ. రాజ్య‌స‌భ 250వ సెష‌న్ సంద‌ర్భంగా ఇవాళ‌ ప్ర‌ధాని మోదీ మాట్లాడారు. రాజ్య‌స‌భ 250వ స‌మావేశాల్లో పాల్గొన‌డం సంతోషంగా ఉంద‌న్నారు.ఫెడ‌ర‌ల్ వ్య‌వ‌స్థ‌కు రాజ్య‌స‌భ ఆత్మవంటిద‌న్నారు. డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ రాజ్య‌స‌భ‌ స‌భ్యుడిగా పార్ల‌మెంట్‌కు వ‌చ్చార‌న్నారు. దేశం మంచి కోసం రాజ్య‌స‌భ ఎప్పుడూ ముందు ఉండి న‌డిచింద‌న్నారు. రాజ్య‌స‌భ ఎన్నో కీల‌క బిల్లుల‌ను పాస్ చేసింద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ప్రాంతీయ పార్టీలైన నేషనల్​ కాన్ఫరెన్స్​(ఎన్సీపీ), బిజు జనతా దళ్​(బీజేడీ)ల‌ను ఆయ‌న ప్ర‌శంసించారు.


రాజ్య‌స‌భ 250వ స‌మావేశం సంద‌ర్భంగా ఇవాళ ప్ర‌త్యేక చ‌ర్చ చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మాట్లాడుతూ...స‌భ మధ్యలోకి వెళ్లకుండానే...నిర‌స‌న‌లు చేప‌ట్ట‌కుండానే... ప్రజల మనసు గెలుచుకోవచ్చని స‌భ్యుల‌కు సూచించి స‌భలో ఇప్పటి వరకు నిరసనలు చేపట్టని నేషనల్​ కాన్ఫరెన్స్​(ఎన్సీపీ), బిజు జనతా దళ్​(బీజేడీ) ఎంపీల‌ను అభినందించారు. సభా విలువలను వారు గౌరవించారని కొనియాడారు. బీజేపీ సహా ఇతర పార్టీలు.. ఎన్సీపీ, బీజేడీలను చూసి సభలో ఎలా వ్యవహరించాలో నేర్చుకోవాలని సూచించారు. ఎన్సీపీ, బీజేడీలు స‌భ స‌జావుగా సాగేందుకు స‌హ‌క‌రించాయ‌న్నారు. ఈ రెండు పార్టీలు పార్ల‌మెంట‌రీ నియ‌మావ‌ళిని అద్భుతంగా పాటించాయ‌న్నారు. వాళ్లు ఎప్పుడూ వెల్‌లోకి దూసుకురాలేద‌న్నారు. అయినా వారి వారి స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తార‌న్నారు.


రాజ్య‌స‌భ చ‌రిత్ర సృష్టించింద‌ని, ఎన్నో చ‌రిత్రాత్మ‌క సంఘ‌ట‌న‌ల‌కు సాక్ష్యంగా కూడా నిలిచింద‌న్నారు. రాజ్య‌స‌భ‌కు ఎంతో ముందు చూపు ఉన్నద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు.. ట్రిపుల్ త‌లాక్ బిల్లు రాజ్య‌స‌భ‌లో ఆమోదం కాద‌న్న అభిప్రాయం ఉండేది. కానీ ఆ బిల్లు రాజ్య‌స‌భ‌లో పాసైంద‌ని మోదీ గుర్తు చేశారు. జీఎస్టీ బిల్లుకు కూడా ఇదే స‌భ‌లో ఆమోదం ద‌క్కింద‌న్నారు. దేశ సంక్షేమం కోసం ప‌నిచేసే విధంగా మ‌న రాజ్యాంగం స్పూర్తినిస్తోంద‌న్నారు. స‌హ‌కార స‌మాఖ్య స్పూర్తికి రాజ్య‌స‌భ మ‌రింత ఊత‌మిస్తోంద‌న్నారు. ఆర్టిక‌ల్ 370, 35ఏ లాంటి బిల్లుల‌ను కూడా రాజ్య‌స‌భ పాస్ చేసింద‌న్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: