తిరుమల శ్రీవారి ఆలయంలో  జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ గురించి నానా యాగి చేస్తున్న టిడిపి నేతలు మరి అదే ప్రశ్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఎందుకు అడగటం లేదు. నిజానికి తిరుమల ఆలయంలో జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి అనే అంశాన్ని ఉద్దేశ్యపూర్వకంగానే చంద్రబాబునాయుడు రాజకీయం చేస్తున్నారన్న విషయం అందరికీ తెలుసు.

 

మొన్నటి ఎన్నికల్లో జగన్ చేతిలో చావుదెబ్బ తిన్న దగ్గర నుండి చంద్రబాబుకు ఒళ్ళు మండిపోతోంది. దాంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగానే తిరుమల ఆలయంలో జగన్ డిక్లరేషన్ ఇవ్వలేదు అన్న సమస్యను హైలైట్ చేస్తున్నారు. అర్జంటుగా హిందువులను జగన్ కు వ్యతిరేరకంగా మార్చాలన్న టార్గెట్ పెట్టుకుని చంద్రబాబు రాజకీయం మొదలుపెట్టారు. దాన్ని మతిలేని మిగిలిన నేతలు కంటిన్యు చేస్తున్నారు.

 

నిజానికి జగన్ పుట్టింది, పెరిగింది కడపలోనే. ఎన్నోసార్లు తిరుమలకు వెళ్ళి దర్శనం చేసుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా జగన్ శ్రీవారిని దర్శించుకున్న విషయం అందిరికీ తెలిసిందే. మరి అప్పుడెప్పుడు టిడిపి నేతలు అభ్యంతరాలు ఎందుకు లేవనెత్తలేదు ? పోని వైఎస్సార్ ఉండగా కూడా ఈ విషయాన్ని చంద్రబాబు ఎందుకు ప్రస్తావించలేదు ?

 

సరే ఈ విషయాలను పక్కనపెడితే జగన్ అడుగుతున్న ప్రశ్ననే చంద్రబాబు కానీ టిడిపి నేతలు కానీ పవన్ ను ఎందుకు అడగటం లేదు ?  జగన్ క్రిస్తియన్ కాబట్టి తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలంటున్నారు. మరి ఆస్ట్రేలియా అమ్మాయిని వివాహం చేసుకున్న తర్వాత  పవన్ చర్చ్ లకు వెళ్ళి ప్రార్ధనలు చేస్తున్నారు కదా ? 

 

వివాహం తర్వాత భార్యను హిందువుగా మార్చారా ? లేకపోతే తానే క్రిస్తియన్ గా మారిపోయారా ? ఏం జరిగిందో  తెలీదు కానీ పవన్ చర్చ్ కు వెళ్ళటమైతే వాస్తవం. అలాగే తిరుమల శ్రీవారి దర్శనానికి కూడా వెళుతున్నారు కదా ? మరి పవన్ అక్కడ డిక్లరేషన్ ఏమైనా ఇచ్చారా ?  అన్యమతస్తురాలిని వివాహం చేసుకున్న పవన్ కు తిరుమల శ్రీవారిపై నమ్మకం ఉందని చెబుతు డిక్లరేషన్ ఇవ్వాలని టిడిపి నేతలు పవన్ ను ఎందుకు డిమాండ్ చేయటం లేదు ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: