తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రహీరోల్లో ఒకరిగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ...ఎప్పుడు రాజకీయాలు తిరుగుతూనే ఉంటాయి. సినిమాల్లో బిజీగా ఉన్న ఆయనని మాత్రం రాజకీయాలు వదలవు. ఏదో సమయంలో ఆయన ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఇటీవల అయితే ఆ ప్రస్తావన మరింత ఎక్కువగా వస్తుంది. మొన్న ఎన్నికల్లో టీడీపీ ఘొరంగా ఓడిపోవడంతో  ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వాల్సిందే అని అభిమానులు, కొందరు టీడీపీ మద్ధతుదారులు కోరుతున్నారు. అయితే తాజాగా ఈ డిమాండ్ మరింత పెరిగింది. 


ఒకప్పుడు ఎన్టీఆర్ తో సన్నిహితంగా మెలిగిన వల్లభనేని వంశీ టీడీపీని వీడి వైసీపీకు మద్ధతు ఇచ్చే క్రమంలో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ లపై తీవ్ర విమర్శలు చేశారు. లోకేశ్ పెద్ద పప్పు అని, అతని కోసం చంద్రబాబు పార్టీని నాశనం చేస్తున్నారని మాట్లాడారు. 2029 లోపు టీడీపీ చరిత్ర ముగిసిపోతుందని కామెంట్ చేశారు. అటు మంత్రి కొడాలి నాని కూడా టీడీపీని ఎన్టీఆర్ తప్ప ఎవరు బ్రతికించలేరని వ్యాఖ్యానించారు. అయితే ప్రత్యర్ధులుగా వారి విమర్శలు చేసిన వీటిని మాత్రం తెలుగు తమ్ముళ్ళు కాస్త సీరియస్ గానే తీసుకున్నట్లు తెలుస్తోంది. 


ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీని చంద్రబాబు నడిపించగలరు. ఇప్పుడు టీడీపీ పరిస్తితి దారుణంగా ఉన్న ఆయన ఏదొక విధంగా నెట్టుకొచ్చేయగలరు. సరే ఇప్పుడు సంగతి వదిలేస్తే ఆయన వయసు మీద పడుతున్న తరుణంలో పార్టీ పరిస్తితి ఏంటి? అని ఆలోచించగానే తమ్ముళ్ళ మదిలో కలవరం మొదలవుతుంది. ప్రస్తుతం చంద్రబాబు డెబ్బైల్లో ఉన్నారు. 2024 ఎన్నికల్లో కూడా ఎలాగోలా నెట్టుకు రాగలరు. 


ఇక 2029 ఎన్నికల దగ్గరకొచ్చేసరికి ఆయన వయసు 80 అవుతుంది. రాజకీయాల్లో ఆయన దూకుడు తగ్గుతుంది. అటు లోకేశ్ కు పార్టీని నడిపించెంత సీన్ కూడా రాకపోవచ్చు. అయినా సరే బాబు... కొడుకుని పెట్టుకుని బండి నడిపించేద్దాం అనుకుంటారు. కానీ అది సాధ్యమైన పని కాదు. ఒక్కసారి బాబు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండటం తగ్గిస్తే, నేతలు వేరే మార్గాలు చూసుకుంటారు. అప్పుడు టీడీపీని నిలబెట్టుకోవడానికి ఎన్టీఆర్ ని రంగంలోకి దించాలని భావిస్తారు. ఎన్టీఆర్ కూడా అప్పుడు రాజకీయాల్లోకి రావడం కూడా సులువే అవుతుంది. 


ఎందుకంటే ప్రస్తుతం జూనియర్ వయసు 36...2029కి 46 అవుతుంది. అంటే ఇప్పుడు ఏపీ సీఎం జగన్ వయసు. ఆ వయసులో రాజకీయాల్లోకి వస్తేనే ఎన్టీఆర్ నిలబడగలుగుతారు. లేదంటే వయసు పెరిగేకొద్ది ఇబ్బందులు వస్తాయి. కాబట్టి 2029 లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేయొచ్చు. అప్పుడు ఆయనకు తెలుగు తమ్ముళ్ళు కూడా పూర్తి మద్ధతు పలికే అవకాశముంది.


మరింత సమాచారం తెలుసుకోండి: