తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీలో నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు షురూ అయ్యింది. ఎమ్మెల్యేలు ఎవ‌రికి వారు పైచేయి కోసం ఆధిప‌త్య యుద్దం చేస్తున్నారు. ఇప్ప‌టికే అక్క‌డ మంత్రులు వ‌ర్సెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు వ‌ర్సెస్ ఎమ్మెల్యేల మ‌ధ్య వార్ న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే మండుతోంది. ఇద్ద‌రు గులాబీ పార్టీకి చెందిన వారే అయినా  కొంత‌కాలంగా ఆధిప‌త్యం పోరు సాగుతోంది. 


గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం వ్యవహారం పార్టీలో దుమారం రేపుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో అంత‌ర్గ‌త‌గా ఉన్న సెగ‌లు ఇప్పుడు ముదిరి పాకాన ప‌డ్డాయి. ఒక‌రిపై మ‌రొక‌రు బ‌హిరంగంగా విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు. ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఒక‌రిపై మ‌రొక‌రు అధిష్టానానానికి సైతం ఫిర్యాదు చేసుకున్న‌ట్టు పార్టీలో చ‌ర్చ న‌డుస్తోంది.


నా నియోజ‌క‌వ‌ర్గంలో నీకు ప‌నేంటి అని ఒక‌రికి మ‌రొక‌రు వార్నింగ్‌లు ఇచ్చుకునే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లిన‌ట్టు టాక్‌. అలంపూర్‌లో కృష్ణ మోహన్ ఇసుక దందాకు పాల్పడుతున్నారని అలంపూర్ ఎమ్మెల్యే అబ్ర‌హం ఆరోప‌ణ‌లు చేయ‌డంతో వీరిద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్ధం ఆరంభ‌మైంది. వ‌చ్చే మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ అలంపూర్‌లో తాను చెప్పిన వాళ్ల‌కు సీట్లు ఇవ్వ‌క‌పోతే.. తాను ఇండిపెండెంట్ల‌ను రంగంలోకి దించుతాన‌ని కూడా కృష్ణ‌మోహ‌న్ బెదిరిస్తున్నాడ‌ని అబ్ర‌హం అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన‌ట్లు టాక్‌..?


ఇక త‌న నియోజ‌క‌వ‌ర్గ‌మైన అలంపూర్‌కు నీళ్లు రాకుండా కూడా ఆయ‌న అడ్డు ప‌డుతున్న‌ట్టు కూడా ఎమ్మెల్యే కృష్ణమోహన్‌పై మంత్రి శ్రీనివాస్ గౌడ్‌‌తో పాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లార‌ని పార్టీ కార్య‌క‌ర్త‌లు చ‌ర్చించుకుంటున్నారు.  వీరి మ‌ధ్య రాజీ కుదిర్చేందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన ప్ర‌య‌త్నాలు కూడా ఫెయిల్ అయ్యాయ‌ని టాక్‌. మ‌రి ఈ వివాదం ఎలా మ‌లుపులు తిరిగి ఎలా ముగుస్తుందో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: