స్వచ్చమైన ప్రేమకు గుర్తుగా తాజ్ మహల్‌ను పేర్కొంటారు. ఎందుకంటే ముంతాజ్‌ ప్రేమకు గుర్తుగా ఆయన నిర్మించిన ఈ కట్టడం ప్రపంచ వింతల్లో చోటు సంపాదించుకున్న విషయమూ మనకు తెలిసిందే. ఇకపోతే ప్రేమలో పడిన ప్రతివారు తాజ్‌మహల్‌ను తమ ప్రేమకు గుర్తుగా అభివర్ణించుకుంటారు. మనసులోని భావాలకు ప్రతి రూపంగా మరపు రాని జ్ఞాపకాలకు నిలయంగా ఈ తాజ్‌మహల్‌ను పోల్చుకుంటారు.


ఇంతటి  సౌందర్యాన్ని దాచుకున్న ఈ అందమైన కట్టడం పేరును మార్చాలని చూస్తున్నారట. అదెవరంటే యూపీలోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ప్రపంచ ప్రసిద్ది చెందిన ఆగ్రా పేరు మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ పేరును నాలుగు వంకలుగా తిప్పి ఆగ్రవాన్ గా పిలిచే రోజులు దగ్గర పడుతున్నాయంటున్నారు.. ఇకపోతే ఉత్తరప్రదేష్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ భాద్యతలు స్వీకరించిన తరువాత  ఆ రాష్ట్రంలోని ప్రముఖ నగరాల పేర్లు ఒక్కొక్కటి మారిపోతున్నాయి.


ఈ క్రమంలోనే ఆగ్రా పేరు ఆ జాబితాలో చేరగా, ఆగ్రవాన్ గా మార్చడానికి ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారని  తెలుస్తుంది. మరో ముఖ్య విషయమేంటంటే అంబేద్కర్ యూనివర్శిటీ చరిత్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ సుగమ్ ఆనంద్ ఇప్పటికే కొన్ని పరిశోధనలు చేసి తాజ్ మహల్ ఉన్న తాజ్ నగర్ ను మొదట్లో ఆగ్రవాన్ గా పిలిచే వారని ప్రాథమిక సాక్షాల ద్వారా తెలిపారట, అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారులు అంటున్నారు.


ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం బయటకు తీసే పనిలో ఆంబేద్కర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ నిమగ్నం అయ్యారు. మహాభారత్ కాలంలో ఆగ్రాను ఆగ్రవాన్, ఆగ్రబాణ్ అని పిలిచేవారని ప్రాథమిక సాక్షాల ద్వారా తెలిసిందని, అందుకు సంబంధించిన పూర్తి సాక్షాలు తాము సేకరిస్తున్నామని అంబేద్కర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ సుగమ్ ఆనంద్ ఈ సందర్భంగా అంటున్నారు. మొత్తం మీద తాజ్ మహల్ ఉన్న ఆగ్రాను త్వరలో ఆగ్రవాన్ అని పిలవడానికి అందరూ సిద్దంగా ఉండాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పరోక్షంగానే సంకేతాలు ఇస్తుందన్న మాట.



మరింత సమాచారం తెలుసుకోండి: