ఇండియా పాక్ దేశాల మధ్య సంబంధాలు ఒకప్పటిలా లేవు.  ఆర్టికల్ 370 రద్దు తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.  ఎంతగా దెబ్బతిన్నాయి అంటే, ఇండియాకు చెందిన వివిఐపి విమానాలు ఆ దేశం గగనతలం మీదగా వెళ్లేందుకు అనుమతి కూడా ఇవ్వడం లేదు.  ఈ స్థాయిలో రెండు దేశాల మధ్య సంబంధహలు దెబ్బతిన్నాయి.  రెండు దేశాల మధ్య ఇలాంటి సమస్యలు ఇప్పుడేమి కొత్తకాదు.  ఎప్పటి నుంచో ఇలానే జరుగుతున్నది.  


1948, 1969, 1971, 1999 లో జరిగిన యుద్ధాల సమయంలో, యుద్ధాల తరువాత కూడా రెండు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి.  రెండు దేశాల మధ్య దెబ్బ తిన్న సంబంధాలను పునరుద్ధరించడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోతున్నది.  తాజగా రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ సమీపంలో ఉన్న చోలిస్తాన్ ప్రాంతంలోకి ఇండియాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు.  పొరపాటుగా ఇలా ప్రవేశించారు.  


దీంతో అక్కడి పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఇందులో ఒకరు తెలుగు వ్యక్తి కావడంతో రెండు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొన్నది.   అరెస్ట్ అయిన వ్యక్తి పేరు ప్రశాంత్..అని తెలిసింది.  అరెస్ట్ తరువాత అతనిని కోర్టుకు తీసుకెళ్లారు.  కోర్టు బయట అతన్ని మీడియా ప్రశ్నించింది.  కానీ, ఆ వ్యక్తి తెలుగులోనే సమాధానాలు చెప్పడంతో పాక్ మీడియాకు అర్ధం కాలేదు.  మమ్మి, దాడి బాగున్నారా.. ఇక్కడ అంతా బాగుంది.  నావల్ల ఎలాంటి ఇబ్బంది లేదని తెలుసుకున్నాకే ఇక్కడికి తీసుకొచ్చారు.  జైలుకు పంపుతారట.

 
అక్కడి నుంచి బెయిల్ కోసం ఓ ప్రక్రియ ఉంటుంది.  భారత రాయబార కార్యాలయానికి పంపుతారట.  నెల రోజుల్లోనే తిరిగి వస్తాను అని మాట్లాడాడు. ప్రశాంత్ తెలుగులో మాట్లాడటంతో తెలుగు రాష్ట్రలు అలర్ట్ అయ్యాయి.  ఎవరీ ప్రశాంత్ అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ప్రశాంత్ విశాఖకు చెందిన వ్యక్తి అని, రెండేళ్ల క్రితం ఇంట్లోనుంచి వచ్చేశాడని ప్రాధమిక దర్యాప్తులో తేలింది.  పూర్తి వివరాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: