ప్రేమ ఎంతదూరమైనా నడిపిస్తుంది.  ఎంతటి సాహసమైన చేయిస్తుంది.  అలాంటి సాహసమే ఇప్పుడు ఓ వ్యక్తిని జైలు పాలు చేసింది.  ప్రేమ వ్యవహారం రెండు దేశాల మధ్య సమస్యగా మారింది.  ఏంటి ఆ ప్రేమ.. ఏంటి ఆ దేశాల మధ్య ఉన్న సమస్య తెలుసుకుందాం.  ఇండియా.. పాకిస్తాన్ దేశాల గురించి చెప్పండి అంటే.. రెండు దేశాలు దాయాదులు.  రెండు దేశాల మధ్య సంబంధాలు బాగున్నాయి.  అయితే, ఆగష్టు 5 వ తేదీన ఆర్టికల్ 370 రద్దు తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.  


అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నది పాకిస్తాన్.  ఇలాంటి సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా దాని వలన రెండు దేశాలకు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.  ఇండియన్ మాజీ అధికారి కులభూషణ్ ను అలానే పాక్ ప్రభుత్వం అదుపులోకి తీసుకొని తీవ్రవాదిగా ముద్ర వేసింది.  అయితే, ఇప్పుడు ఇలాంటి సమస్యే మరొకటి తలెత్తింది.  పొరపాటున రాజధాని ఎడారిలో ఇండియా బోర్డర్ ను ప్రశాంత్ అనే తెలుగు వ్యక్తి దాటాడు.  


ఎందుకు దాటాడు అనే దానిపై అనేక అనుమానాలు వస్తున్నాయి.  ప్రేమ కోసం, ప్రేయసి కోసం పాక్ బోర్డర్ వరకు వెళ్లాడని, అయితే, పొరపాటున పాక్ బోర్డర్ లోకి ప్రవేశించాడని తెలుస్తోంది.  ప్రేమ కోసం, ప్రేయసి కోసం హైదరాబాద్ నుంచి రాజస్థాన్ వరకు వెళ్లడం ఏంటి.. అసలు ప్రశాంత్ ప్రేమ కథ ఏంటి అనే విషయంపై ఇప్పుడు అందరి దృష్టి ఉన్నది.  ప్రశాంత్ హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అని తెలుస్తోంది.  


పాక్ లో అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లారు.  అతని వివరాలు అన్ని కనుక్కొని, తాని నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవని తెలుసుకున్న పాక్ అధికారులు కోర్టుకు తీసుకెళ్లారు.  అక్కడి నుంచి అతడిని జైలుకు పంపిస్తారట.  మరో నెలరోజుల్లో సేఫ్ గా తిరిగి వస్తానని చెప్తున్నాడు ప్రశాంత్.  దీనికి సంబంధించిన వీడియోను పాక్ రిలీజ్ చేసింది.  అయితే, పాక్ బోర్డర్ ను ఎందుకు దాటాల్సి వచ్చింది అనే దాని చుట్టూనే ఇప్పుడు కథ నడిచే అవకాశం ఉన్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: