పెదబాబు, చినబాబుల్లో ఎవరు హాజరవుతారో ?

 

ఇపుడిదే అంశంపై తెలుగుదేశంపార్టీలో చర్చలు మొదలయ్యింది. వచ్చే జనవరిలో స్విట్జర్లాండ్ లోని దావోస్ లో  మూడు రోజుల పాటు సదస్సు జరగబోతోంది. దావోస్ లో మూడు రోజుల అంతర్జాతీయ సదస్సంటే ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రిస్టేజియస్ కార్యక్రమమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అటువంటి అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు చంద్రబాబునాయుడు, నారా లోకేష్ ల్లో ఎవరు వెళతారన్నదే ఆసక్తికరంగా మారింది.

 

చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్న దావోస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు క్రమం తప్పకుండా వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచంలోని ప్రముఖ ఆర్ధిక వేత్తలు, పారిశ్రామికవేత్తలు, దేశాధినేతలు మాత్రమే పాల్గొనే దావోస్ సదస్సుకు చంద్రబాబు ఎలా హాజరవుతున్నారు ? అన్నదే చాలా కాలంపాటు సస్పన్సుగా మిగిలిపోయింది.

 

చివరకు పొరబాటుగా ఓ సారి ఆ విషయం బయటపడిపోయింది. నిజానికి దావోస్ ఎకనామిక్ ఫోరం నిర్వాహకుల నుండి చంద్రబాబుకు ఏరోజు ఎలాంటి ఆహ్వానం అందలేదు. సదస్సులో పాల్గొనేందుకు చంద్రబాబే సుమారు రూ. 3 కోట్లు పెట్టి ఆహ్వానాన్ని కొనుక్కుని ప్రతిసారి  హాజరయ్యేవారట. ఈ విషయం బయటపడటంతో రాష్ట్రం పరువు పోయింది.

 

మంత్రిగా ఉన్న కాలంలో నారా లోకేష్ కూడా దావోస్ సదస్సుకు హాజరయ్యారు. మరి ఈయనెలా హాజరయ్యారో తెలీదు లేండి. ఏపి నుండి దావోస్ కు చంద్రబాబు, చినబాబు హాజరవుతున్నారని చెప్పుకుని ప్రచారం చేయించుకోవటం మామూలైపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత సదస్సుకు దగ్గరలోని ఏదో ఓ హోటల్లో రూములు బుక్ చేసుకుని ఏపి స్టాల్ ఓపెన్ చేస్తారు.

 

హోటల్ ముందునుండి వచ్చే పోయే వాళ్ళని పిలిచి మాట్లాడి ఫొటోలు దిగుతారు. ఆ ఫొటోలను మీడియాకు పంపి ప్రచారం చేయించుకుంటారు. ఎలాగూ ఎల్లోమీడియా ఉంది కాబట్టి విపరీతంగా ప్రచారం వచ్చేది. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా జరిగే తంతు ఇలాగే ఉండేది. మరి ఇపుడు ప్రతిపక్షంలో కూర్చున్నారు కదా ?  జనవరిలో జరగనున్న దావోస్ సదస్సులో పాల్గొనేందుకు చంద్రబాబు వెళతారా ? లేకపోతే చినబాబును పంపుతారా ? అన్నదే పెద్ద సస్పెన్సుగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: