ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల సంక్షేమమే ముఖ్య ఉద్దేశ్యంగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ప్రజలందరి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే  రాష్ట్రంలోని ప్రజలు ఎవరు మద్యం బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకోకూడదని సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికలు రచించి రాష్ట్రంలో మద్యపాన నిషేధానికి శ్రీకారం చుడుతున్నారు. బెల్టుషాపుల మూసివేయించి  ప్రభుత్వ పరిధిలోనే  మద్యం షాపులను నడుపుతున్నారు. అంతేకాకుండా మద్యం షాపుల సమయాన్ని కూడా కుదించారు  జగన్మోహన్ రెడ్డి. 

 

 

 

 ఈ క్రమంలో బార్లకు  లాభం చేకూర్చేందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  మద్యం షాపుల సమయాన్ని కుదించారంటూ  ఆంధ్ర రాజకీయాల్లో చర్చించుకున్నారు. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.నేడు  ఎక్సైజ్ శాఖ తో సమీక్ష సమావేశం నిర్వహించిన  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... కొత్త బార్ పాలసీపై చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఉన్న బార్ల సంఖ్యను తగ్గించడంతో పాటు బార్ల నిర్వహించే సమయం పై  కూడా ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ చర్చించనున్నారు. అంతేకాకుండా పలువురు మంత్రులు ఉన్నతాధికారులతో  షుగర్ ఫ్యాక్టరీ లపై కూడా ముఖ్యమంత్రి చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 

 

 

 

 ఇక అనంతరం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఆర్థిక శాఖ పై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై చర్చించి... సంక్షేమ పథకాల అమలుకు నిధుల సమీకరణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలువురు మంత్రులు ఉన్నతాధికారులతో చర్చలు జరపనున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే మద్యం షాపుల సంఖ్య తగ్గించిన సీఎం జగన్మోహన్ రెడ్డి... మద్యం షాపుల సమయాన్ని కూడా కుదించారు . ఇప్పుడు తాజాగా బార్ల సంఖ్యను తగ్గించడంతో పాటు... బార్ల సమయాన్ని  సంఖ్యలో కుదిస్తూ సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా మరో అడుగు ముందుకు వేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: