ఢిల్లీకి చెందిన భారతీ జైన్ అనే జర్నలిస్ట్ ఒక కోతి తీవ్రంగా గాయపడి రోడ్డు మీద పడి ఉంటే దానిని ఫోటో తీసి ట్విట్టర్ లో అప్లోడ్ చేసి సాయం చేయాలని కోరింది. ఇది చూసిన లోక్‌సభ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ...కోతి సత్వర చికిత్స కోసం కారును పంపి తన గొప్ప మనసును చాటుకుంది.

 

వివరాల్లోకి వెళితే... సోమవారం రోజు మధ్యాహ్నం.. జర్నలిస్ట్ భారతి జైన్ ట్వీట్ చేస్తూ" ఈ చిత్రం లో ఉన్న కోతి తీవ్రంగా గాయపడింది. దాని పరిస్థితి అస్సలు బాగోలేదు. దయచేసి ఎవరైనా ఎన్జిఓ కానీ జంతు హక్కుల కార్యకర్తల కానీ ముందుకు వచ్చి ఈ కోతిని రక్షించండి. రైసినా రోడ్డులో ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా వద్ద ఫుట్‌పాత్‌పై ఈ కోతి ఉంది" అంటూ జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ ని ట్యాగ్ చేసింది. 

 

భారతి జైన్ ట్వీట్ చేసిన 20 నిమిషాల లోపే మేనకా గాంధీ స్పందించారు. మేనకా గాంధీ ట్వీట్ చేస్తూ "నన్ను ట్యాగ్ చేసినందుకు ధన్యవాదాలు. నేను తక్షణమే కారు పంపించి ఆ కోతి సత్వర చికిత్స కోసం సంజయ్ గాంధీ జంతు సంరక్షణ కేంద్రానికి తరలిస్తాను. కొన్ని నిమిషాలలో కారు అక్కడికి వస్తుంది." అని ట్వీట్ చేశారు. 

 

జర్నలిస్ట్ భారతి జైన్ మళ్లి ట్వీట్ చేస్తూ... "ఇప్పుడే కోతిని తీసుకెళ్లారు. ఆ కోతి రక్షించబడుతుందని నేను నమ్ముతున్నాను." అని తెలిపారు. 

 

వెంటనే స్పందించి ఆ కోతిని రక్షించినందుకు మేనకాగాంధీని నెటిజెన్లు బాగా కొనియాడుతున్నారు. గొప్ప పని చేశారు మేడం, మిమ్మల్ని ఎంతో గౌరవిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అంటూ మేనకా గాంధీని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఈ ట్వీట్ కు 9 వేలకి పైగా లైక్స్ వచ్చాయి. 1500 మందికి పైగా రీట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: