గన్నవరం నియోజకవర్గంలో వైసిపికి సంబంధించి రేగిన వివాదం టి కప్పులో తుపాను మాదిరిగా పరిష్కారమైపోయింది. తెలుగుదేశంపార్టీ ప్రాధమిక సభ్యత్వంతో పాటు ఎంఎల్ఏ పదవికి కూడా వల్లభనేని వంశీ రాజీనామా చేయటంతో వైసిపిలో వివాదం రేగింది. టిడిపి ఎంఎల్ఏ రాజీనామా చేస్తే వైసిపిలో వివాదం ఎందుకు మొదలైంది ? ఎందుకంటే రాజీనామా చేసిన ఎంఎల్ఏ వైసిపికి మద్దతు ప్రకటించారు కాబట్టే.

 

అంటే ఏదో రోజు వంశీ వైసిపిలో చేరటం ఖాయం. రాజీనామా కారణంగా ఖాళీ అయిన నియోజకవర్గానికి ఉపఎన్నికలూ అంతే ఖాయం. మరపుడు ఉపఎన్నికలో ఎవరు పోటి చేయాలి ? మొన్నటి ఎన్నికల్లో వైసిపి తరపున పోటి చేసిన యార్లగడ్డ వెంకట్రావా ? లేకపోతే వైసిపిలో చేరబోతున్న వంశీనా ? ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసి వైసిపిలోకి రాబోయే వంశీకి ప్రాధాన్యత ఉంటుంది సహజంగా. మరపుడు యార్లగడ్డ పరిస్ధితేంటి ?

 

ఇక్కడే సమస్య మొదలైంది. ఆ పంచాయితీనే చివరకు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు చేరింది. కృష్ణా జిల్లా మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో పాటు యార్లగడ్డ కూడా జగన్ తో భేటి అయ్యారు. గంటపాటు జరిగిన సమావేశంలో జగన్ సమస్యను పరిష్కరించేశారు. జగన్ చెప్పిన పరిష్కారానికి యార్లగడ్డ పిచ్చ హ్యాపీగా ఉన్నారట. ఇంతకీ జగన్ ఏం చెప్పారంటే యార్లగడ్డను ఎంఎల్సీని చేస్తానని హామీ ఇచ్చారు.

 

జగన్ హామీ ఇచ్చారంటే ఏం చేస్తారో ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. ఎలాగే మొన్నటి ఎన్నికల్లో యార్లగడ్డ కూడా భారీగా ఖర్చు పెట్టుకున్నారు. కాబట్టి మళ్ళీ ఇపుడు ఆ ఖర్చు మిగిలిపోతాయి. అదే సమయంలో రూపాయి ఖర్చు లేకుండా ఎంఎల్సీ పదవి వస్తోంది. ఇంకేం కావాలి ? అందుకనే యార్లగడ్డ ఫుల్లు హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఉపఎన్నికలో పోటి చేయబోయేది వంశీనే అని తేలిపోయింది.  టిడిపి తరపున ఎవరిని రంగంలోకి దింపాలనే విషయంలో ఇక తేల్చుకోవాల్సింది చంద్రబాబునాయుడే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: