హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రశాంత్ ను పాక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ తో పాటు మధ్యప్రదేశ్ కు చెందిన టెక్కీని కూడా ఆ దేశ భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న బహవాల్‌పూర్‌లో వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్ మీడియా వీరి దగ్గర పాస్ పోర్ట్, వీసా లేవని చెబుతోంది. ఆన్ లైన్ లో పరిచయం అయిన ఒక యువతి కోసం ప్రశాంత్ పాకిస్తాన్ కు గూగుల్ మ్యాప్ ఆధారంగా వెళ్లాడని సమాచారం. 
 
పాక్ వెబ్ సైట్లలో ప్రశాంత్ తెలుగులో మాట్లాడిన ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. పాక్ మీడియాలో వీరిద్దరూ ఉగ్రదాడులు చేయటానికి పాకిస్తాన్ కు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ విశాఖపట్నంకు చెందిన వాడని తెలుస్తోంది. ప్రశాంత్ తండ్రి బాబూరావు ప్రశాంత్ గురించి కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. ప్రశాంత్ తండ్రి బాబూరావు ప్రశాంత్ రెండు సంవత్సరాల క్రితం ఆఫీస్ కు వెళ్లి తిరిగి రాలేదని చెబుతున్నాడు. 
 
ప్రశాంత్ గతంలో ఒక అమ్మాయిని ప్రేమించాడని ఆ అమ్మాయితో ప్రేమ విఫలం కావటంతో ప్రశాంత్ కు మానసిక సమస్యలు ఎదురయ్యాయని పాక్ సరిహద్దులకు ప్రశాంత్ ఎందుకు వెళ్లాడో తనకు తెలియదని ప్రశాంత్ తండ్రి చెబుతున్నాడు. రెండు సంవత్సరాల క్రితం ప్రశాంత్ గురించి పోలీస్ స్టేషన్ల్ లో కూడా ఫిర్యాదు చేశామని బాబూరావు చెప్పారు. మా అబ్బాయి సున్నితమైన మనస్తత్వం కలవాడని ప్రశాంత్ తండ్రి బాబూరావు చెబుతున్నారు 
 
తమ కుమారుడు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తి కాదని ప్రశాంత్ తండ్రి చెబుతున్నారు. ఢిల్లీ వెళ్లి రాయబార కార్యాలయాన్ని సంప్రదించి తన కొడుకుని క్షేమంగా అప్పగించాలని కోరతానని బాబూరావు చెబుతున్నాడు. ప్రశాంత్ అరెస్ట్ వ్యవహారం భారత్, పాక్ దేశాల మధ్య మరో వివాదానికి కారణమయ్యే అవకాశం ఉంది. పాక్ చట్టంలోని 334 - 4 కింద ప్రశాంత్ పై అభియోగాలు నమోదు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: